పవన్ రీమేక్ మూవీ కోసం సాయి తేజ్ బల్క్ డేట్స్.. అన్ని నెలలు ఇచ్చాడా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక మునపటి కంటే ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలు కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండడంతో ఈయన సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.

ఇక ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉండగా ఇవన్నీ కూడా వచ్చే దసరా లోపు పూర్తి చేయాలనీ టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఇక ప్రెసెంట్ పవన్ కళ్యాణ్ లైనప్ లో హరిహర వీరమల్లు ఉంది.అయితే ఈ షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ కూడా లైన్లో ఉంది.ఇక ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ఆర్డర్ లో ఒక రీమేక్ సినిమా కూడా ఉంది.

Advertisement
Sai Dharam Tej Allots Bulk Dates For Pawan Kalyan's Next, Sai Tej Allots Bulk Da

తమిళంలో మంచి విజయం సాధించిన వినోదయ సీతమ్ అనే సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడు.సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఇక ఇక్కడ తెలుగులో కూడా సముద్రఖని దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కనుంది.ఇందుకు సంబందించిన పూజా కార్యక్రమాలు కూడా చేసిన విషయం విదితమే.

ఇక ఇందులో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.ఇందుకోసం ఈయన బల్క్ డేట్స్ కేటాయించారని టాక్ వినిపిస్తుంది.

Sai Dharam Tej Allots Bulk Dates For Pawan Kalyans Next, Sai Tej Allots Bulk Da

సాయి తేజ్ మూడు నెలల పాటు ఈ సినిమా షూటింగ్ కోసం అందుబాటులో ఉంటాడని తెలుస్తుంది.మరోవైపు పవన్ మాత్రం ఈ సినిమాకు పవన్ 20 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట.ఈయన ఈ సినిమాలో క్యామియో లో నటిస్తున్నాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఫాంటసీ యాంగిల్ లో సాగే ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది.మరి ఇక్కడ ఈ సినిమా విజయం అందుకుంటుందో లేదో చూడాలి.

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

తాజా వార్తలు