ఇంట్లో వేప చెట్టు ఉంటే అశుభమా.. వేప చెట్టు ఏ దిశలో ఉండాలో తెలుసా..!

మనదేశంలో చాలామంది ప్రజలు వేప చెట్టును పూజిస్తూ ఉంటారు.

అంతే కాకుండా మన దేశ ప్రజలు కొన్ని రకాల సంప్రదాయాలలో ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు.

ఇంకా పంటకు పురుగు పట్టకుండా వేప ఆకు రసాన్ని( Neem juice ) పిచికారి చేయడం,బియ్యం లో వేపాకును కలిపి ఉంచడం, చర్మ శుద్ధికి, రక్త శుద్ధికి వేపాకును వాడడం ఇలాంటివన్నీ మన పూర్వీకుల నుంచి వస్తున్నాయి.అంతేకాకుండా ఉగాదిలో వేప పువ్వు ఎంతో ముఖ్యం.

వేపగాలి కూడా మంచిదని ఎక్కువగా ఈ చెట్టును ఇంటి పరిసర ప్రాంతాల్లో చాలామంది ప్రజలు పెంచుతూ ఉంటారు.అసలు ఇన్ని గుణాలున్న వేపచెట్టు మన ఇంట్లో ఏ దిక్కున ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Is It Auspicious To Have A Neem Tree In The House Do You Know Which Direction T

వేప చెట్టు( Neem Tree ) వాస్తు దోషాలను తొలగిస్తుంది అని వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు.అంతేకాకుండా మరికొంతమంది ఇంట్లో పెంచకూడదని కూడా చెబుతూ ఉంటారు.వేప చెట్టుని ఇంట్లో పెంచడం వల్ల అశుభ ఫలితాలను ఇస్తుందని చాలామంది వాస్తు నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Is It Auspicious To Have A Neem Tree In The House? Do You Know Which Direction T

అందుకు కారణం కూడా ఉంది.వేపచెట్టు మహావృక్షం అవుతుంది.

దాని వేళ్ళు ఇంటికి వ్యాపించినప్పుడు ఇంటి గోడలు దెబ్బ తింటాయి.అలా క్రాక్స్ వచ్చిన గోడలు ఇంటికి ఆ శుభాన్ని తీసుకొస్తాయి.

కాబట్టి ఇంట్లో ఎవరూ వేప చెట్టును పెంచకూడదని చెబుతూ ఉంటారు.

Is It Auspicious To Have A Neem Tree In The House Do You Know Which Direction T

ఒకవేళ వేప చెట్టును పెంచిన కాంపౌండ్ వాల్ బయట రోడ్డుపైన పెంచితే మంచిదని చెబుతున్నారు.దక్షిణాదిశలోనే వేప చెట్టుని పెంచాలని, లేదంటే పశ్చిమ దిశ( West direction )లో పెంచాలని చెబుతున్నారు.చాలామంది ప్రజలు ఇంటికి తూర్పు వైపున, ఇంటి ముందు వేప చెట్టుని పెంచుతూ ఉంటారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి30, ఆదివారం 2025

ముఖ్యంగా చెప్పాలంటే తూర్పు దిశలో వేప చెట్టు ఉండడం వల్ల వాస్తు దోషం కలిగి ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి.ఈ వాస్తు దోషం దూరం అయిపోవాలంటే తూర్పు దిశలో వేప చెట్టు ఉంటే గురు, శుక్ర వారాల్లో ఆవేప చెట్టుకు పూజలు చేయాలి.

Advertisement

అంతేకాకుండా ఆ వేప చెట్టుకి 108 పసుపు ధారాలను చుట్టి పూజించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు