ఆధార్ కార్డు జారీపై రూల్స్ మారాయి: UIDAI

ఆధార్ కార్డు.ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి.

అలాగే ఈ కార్డు లేనిదే ఏ సంక్షేమ పథకాలు దరికి చేరవు.సగటు భారతీయుడికి ఆధార్ కార్డును కేంద్రం తప్పనిసరి చేసింది.

దీనిలో భాగంగానే UIDAI ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.ఆధార్ కేంద్రాల ద్వారా సేవలను అందుబాటులో ఉంచింది.

అయితే తాజాగా పిల్లలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిబంధనలను UIDAI కాస్త సడలించింది మీకు తెలుసా? పిల్లల ఆధార్‌ కార్డుల జారీకి వారి తల్లిదండ్రుల ఆధార్‌ నంబర్లు దరఖాస్తు ఫారంలో ఖచ్చితంగా ఇవ్వాలి.

Advertisement

వాటితో పాటు తల్లిదండ్రులలో ఎవరో ఒకరు బయోమెట్రిక్‌ వేయవలసి ఉంటుంది.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ మంత్రిత్వ శా­ఖ UIDAI విభాగపు డిప్యూ టీ డైరెక్టర్‌ ప్రభాకరన్‌ ఆదేశాలు జారీ చేశారు.5 ఏళ్లలోపు ఆధార్ తీసుకునేందుకు వారి వివరాలను ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ తో దరఖాస్తలు చేసుకోవాల్సి ఉంటుంది.అలాగే 5 నుంచి 18 ఏళ్ల మధ్య ఉండేవారికి ఇంకోరకం దరఖాస్తు ఫారం ఉంటుందని UIDAI పేర్కొంది.ఇక దీంతో పాటు.18 ఏళ్లకు పైగా ఉన్న వ్యక్తులకు మరో ఫారమ్ లో దరఖాస్తు ఫారం తీసుకొచ్చినట్లు కూడా వెల్లడించారు.

ఇక ఈ రకంగా చూసుకుంటే ఇపుడు 3 రకాల దరఖాస్తు ఫారాల నమూనాలను UIDAI రిలీజ్ చేసింది.వీటి ద్వారా మాత్రమే ఆధార్ కార్డులు పొందాలని UIDAI ఆదేశాలు జారీ చేసింది.కాగా ఫిబ్రవరి 15 నుంచి వీటిని అందుబాటులో ఉంచారు.

దరఖాస్తు ఫారాలను అన్ని భాషల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు UIDAI తెలిపింది.ఇక నుంచి 5 ఏళ్లలోపు పిల్లలకు ఆధార్ తీసుకోవాలన్నా.

లేక వాళ్ల ఆధార్ లో ఏమైనా తప్పులను కరెక్షన్ చేయాలన్నా.తప్పనిసరిగా తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు కావాల్సిందే.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Advertisement

తాజా వార్తలు