ప్రజల దగ్గరకే పాలన..: మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటినీ అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దగ్గరకే పాలన అని స్పష్టం చేశారు.

ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన సభలు నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో ఈ సభలు జరుగుతాయని చెప్పారు.

ప్రభుత్వ పథకాలకు ప్రజలు పెట్టుకునే దరఖాస్తులను చిత్తశుద్ధితో తీసుకుంటామని తెలిపారు.దరఖాస్తులు ఇచ్చిన తరువాత ప్రజలకు అధికారులు రసీదు ఇస్తారని చెప్పారు.

ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్లు కూడా ప్రజాపాలనలో కీలకపాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.ఇచ్చిన మాట ప్రకారం అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.

Advertisement

ఈ నేపథ్యంలో పథకాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు.ప్రజల ఆలోచనలకు అనుగుణంగా పాలన అందిస్తామని స్పష్టం చేశారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు