నెగిటివ్ వచ్చిన వారికి ఆర్ టీపీసీఆర్ పరీక్షలు : సీఎస్

దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చేస్తోంది.

ఈ మేరకు ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడంలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా శనివారం రాష్ట్రాల 12 ప్రధాన కార్యదర్శిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వైరస్ వ్యాప్తి నివారణలో వివిధ రాష్ట్రాలు తీసుకుంటున్న జాగ్రత్త చర్యలపై కేంద్ర మంత్రి, క్యాబినెట్ కార్యదర్శి వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో అడిగి తెలుసుకున్నారు.రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, మొబైల్ కరోనా బస్సుల్లో నిర్వహిస్తున్న కోవిడ్ పరీక్షలు నిర్వహించడంపై కేంద్ర మంత్రి ప్రశంసించారు.

RTPCR, Tests,negative, CS-నెగిటివ్ వచ్చిన వార�

జాతీయ సగటుతో పోల్చితే మరణాల రేటు తక్కువగా నమోదవ్వడంపై అభినందనలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ.

‘‘రాష్ట్రంలో కరోనా వైరస్ ను ఎదుర్కొవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.

Advertisement

రాష్ట్రంలో యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచిందని, ఎప్పటికప్పుడు ఫలితాలు విడుదల చేస్తోంది.అయితే కరోనా లక్షణాలు ఉండి ర్యాపిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారికి ఆర్ టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తోంది.

అన్ని ఆస్పత్రిలో ఆక్సిజన్ సదుపాయాలు ఏర్పాటు చేస్తోంది.’’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు