అతడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అంటున్న ఆర్టీసీ ఎండి సజ్జనర్..(వీడియో)

ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ దాగుంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి ఉండదు.అన్ని అవయవాలు సరిగా ఉన్న, సరిగా లేకపోయినా సరే.

ఒక వ్యక్తి ఏదో ఒక అద్భుత టాలెంట్ ను తనలో ఉంచుకుంటాడు.నిజానికి అన్ని అవయవాలు బాగున్నవారికంటే కళ్ళు లేని వారిలో ఎక్కువ టాలెంట్ దాగుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇందుకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.వారు ప్రపంచాన్ని వారి కళ్ళతో చూడలేకపోయినా వారి గాత్రంతో ఎంతోమంది ప్రజలను సంతోష పరుస్తుంటారు.

అక్కడక్కడ వారి తోడ్పటుకు వీధులలో కచేరిలను ఏర్పాటు చేసి పాటల పాడుతుండడం మనం గమనిస్తూనే ఉంటాము.ఇకపోతే, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సజ్జనార్ (RTC MD Sajjanar )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement
RTC MD Sajjanar Says To Give Him One Chance..(Video), Tgsrtc MD Sajjanar, Blind

ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నప్పటి నుంచి అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తూ ప్రజలకు ఎంతో చేరువయ్యారు.అంతేకాదు ఆయన సోషల్ మీడియాలో(social media)కూడా యాక్టివ్గా ఉంటూ అనేక ఆసక్తికర అంశాలను ప్రజలతో పంచుకుంటుంటారు.

Rtc Md Sajjanar Says To Give Him One Chance..(video), Tgsrtc Md Sajjanar, Blind

తాజాగా ఓ కళ్ళు లేని యువకుడు అద్భుతంగా పాట పాడిన వీడియో సోషల్ మీడియా ఆయనకు చేరుకోగా.అతడిని సజ్జనార్ (Sajjanar )మెచ్చుకున్నారు.ఓ కళ్ళు లేని అబ్బాయి ఆర్టీసీ బస్సులో శ్రీ ఆంజనేయం(Sri Anjaneyam) సినిమాలోని పాటను అద్భుతంగా ఆలపిస్తూ ఉండడం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూసిన సజ్జనార్ పాట పాడిన యువకుడిని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశాడు.ఇందులో భాగంగా మనం చూడాలే కానీ.ఇలాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో అని తెలుపుతూ అందరూ అద్భుతంగా పాడారు కదా అని మెచ్చుకున్నారు.

అంతేకాకుండా ఒక అవకాశం ఇచ్చి చూడండి కీరవాణి(Keeravani) సార్.అంటూ సోషల్ మీడియా ద్వారా ఆయన రాసుకొచ్చారు.

పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?

దింతో ఆ యువకుడు టాలెంట్ చేసిన నెటిజన్స్ మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు.ఇలాంటి వారికి అవకాశం ఇచ్చి వారి ట్యాలెంట్ను మరింత పై స్థాయికి తీసుకుపోవాలంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు