ఆర్టీసీ సమ్మె : నేడు అర్థరాత్రితో గడువు పూర్తి, ఎంత మంది జాయిన్‌ అయ్యారు?

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇటీవల మంత్రి మండలి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల కోసం మరో అవకాశం ఇచ్చారు.

ఈనెల 5వ తారీకు వరకు అంటే నేడు అర్థరాత్రి వరకు ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి డ్యూటీలో చేరాలని, నేడు చేరకుంటే వారు ఉద్యోగం కోల్పోయినట్లే అంటూ హెచ్చరించాడు.

ఇప్పటికే కేసీఆర్‌ గతంలో ఒక గడువు ఇచ్చాడు.ఆ గడువుకు ఎవరు జాయిన్‌ అవ్వలేదు.

ఈసారి ఎవరైనా జాయిన్‌ అవుతారా అనే చర్చ జరిగింది.ఇప్పటికే నెల రోజులు గడిచినా కూడా ప్రభుత్వం మెట్టు దిగి రాని కారణంగా ఈ గడువులో కార్మికులు ఉద్యోగాల్లో జాయిన్‌ అవుతారని అంతా భావించారు.

కాని కార్మికులు ఇప్పటి వరకు జాయిన్‌ అయ్యేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.ఒకరిద్దరు జాయిన్‌ అవ్వాలనుకున్నా కూడా కార్మిక సంఘం నేతలు వారిని వారిస్తున్నారు.

Advertisement

వారిని భయపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.మొత్తానికి నేటి అర్థరాత్రి వరకు కనీసం వంద మంది కూడా డ్యూటీలో జాయిన్‌ అయ్యే పరిస్థితి లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు