RS Praveen Kumar : నేడు బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..!!

లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.

ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్( RS Praveen Kumar ) బీఆర్ఎస్ గూటికి చేరనున్నారు.

ఈ మేరకు గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు.అలాగే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన బరిలో దిగనున్నారని తెలుస్తోంది.

కాగా హైదరాబాద్( Hyderabad ) లోని అభిమానులు, శ్రేయోభిలాషులతో తన రాజకీయ భవిష్యత్ పై మేధోమధనం చేశానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తనను అనుసరిస్తానని హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

కాంతివంతమైన ముఖానికి సులువైన చిట్కాలు
Advertisement

తాజా వార్తలు