ఆర్ఆర్ఆర్.. తెలుగు కాదు ఇంగ్లీష్?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా వస్తున్న ఆర్ఆర్ఆర్‌పై అప్పుడే ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఉగాది రోజున ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగోతో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

RRR To Have English Title-ఆర్ఆర్ఆర్.. తెలుగు క�

దీంతో ఈ సినిమా టైటిల్ ఏమై ఉంటుందా అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.కాగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్న జక్కన్న సినిమా టైటిల్ విషయంలోనూ అదే ఫార్ములాను వాడుతున్నాడట.

ఈ సినిమాకు పూర్తిగా ఇంగ్లీష్ పదాలతో వచ్చే టైటిల్‌ను పెట్టనున్నట్లు తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్‌కు ‘Rise.

Advertisement

Revolt.Revenge’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో ఇంటర్నేషనల్ ఆడియెన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.మరి ఈ సినిమాకు నిజంగానే ఇంగ్లీష్ టైటిల్‌‌ను వాడుతారా లేక వేరే తెలుగు టైటిల్‌ను వాడుతారా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

డివివి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను జనవరి 2021లో రిలీజ్ చేయనున్నారు.

వేగములు ఎన్ని, అవి ఏవి?
Advertisement

తాజా వార్తలు