అక్కడ కూడా ముగించేస్తున్న ఆర్ఆర్ఆర్.. ఇక లాస్ట్‌దే బ్యాలెన్స్!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.కాగా ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను కరోనా గ్యాప్ తరువాత తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే.

RRR To Finish Mahabaleshwar Schedule, RRR, NTR, RamCharan, Rajamoli, Mahabaleshw

అయితే ప్రస్తుతం మహాబలేశ్వర్ ప్రాంతంలోని అందమైన లొకేషన్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతిని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా తెలియజేశారు.ఈ షూటింగ్‌లో తారక్, చరణ్‌లకు సంబంధించి పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక ఈ షెడ్యూల్ ఒక వారం రోజులు మాత్రమే ఉంటుందని, ఇది పూర్తి చేసుకుని చివరి షెడ్యూల్‌ను డిసెంబర్ చివరి వారంలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.ఈ చివరి షెడ్యూల్‌తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

Advertisement

ఇక తారక్ ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.తారక్ సరసన ఒలివియా మారిస్ హీరోయిన్‌గా నటిస్తుండగా, చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తోంది.

బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కాగా కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే మాత్రం ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

పీరియడ్స్ లో నొప్పులా? ఈ చిట్కాలు పాటించండి
Advertisement

తాజా వార్తలు