రోజాకు `అధికార‌` సెగ‌.. త‌న అనుకున్న వారే వెన్నుపోటు..!!

చిత్తూరు జిల్లా న‌గిరి ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ జ‌బ‌ర్ద‌స్త్ రోజాకు త‌న అనుకున్న వారి నుంచే సెగ‌లు వ‌స్తున్నా య‌ని అంటున్నారు ఎమ్మెల్యే అనుచ‌రులు.

అత్యంత కీల‌క‌మైన నగిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండో సారి కూడా వ‌రుస విజ‌యం సాధించిన రోజా.

మ‌రింత బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గంగా దీనిని త‌న‌కు అనుకూలం చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు.ఈక్ర‌మంలోనే వారానికి రెండు నుంచి మూడు రోజులు ఎంత బిజీగా ఉన్నా.

ఇక్క‌డే ఉంటున్నారు.ఈ క్ర‌మంలోనే స్థానిక స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టారు.

ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నారు.ఈ క్ర‌మంలో తాను ఉన్నా .నియోజ‌క‌వ‌ర్గంలో లేకున్నా.ఆయా ప‌నులు ఆగ‌పోకుండా.

Advertisement
Roja Facing Problems With Those Who Think They Are A Backbone, Ap, Ap Political

జిల్లాలో త‌న‌ను అభిమానించే అధికారుల‌ను ప‌ట్టుబ‌ట్టి ఏకంగా సీఎం జ‌గ‌న్‌తోనే చ‌ర్చించి త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పోస్టింగులు ఇప్పించుకున్నారు.డిప్యూ టీ క‌లెక‌ర్ నుంచిఇంజ‌నీరింగ్‌, పోలీసు అధికారుల వ‌ర‌కు కూడా రోజా.

ఈ సూత్రా్నే పాటించారు.దీంతో ఆమె.ఇంకేముంది.నియోజ‌క‌వ‌ర్గంలో నాకు సంబంధించిన అధికారులే ఉన్నారు క‌నుక ప‌నులు పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని.

వ‌చ్చే నాలుగు ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా త‌న‌కు తిరుగు ఉండ‌ద‌ని అనుకున్నారు.

Roja Facing Problems With Those Who Think They Are A Backbone, Ap, Ap Political

అయితే, ఆదిలో రోజా అనుకున్న‌ట్టుగానేప‌రిస్థితి ఉన్నా.రెండు మూడు మాసాల నుంచి మాత్రం ప‌రిస్థితి దీనికి భిన్నంగా మారిపోయింది. ఎమ్మెల్యే సిఫారసులతో నగరిలో పోస్టింగ్‌లు దక్కించుకున్న వారు.

చుండ్రును తరిమికొట్టే గ్రీన్ టీ.. ఎలా వాడాలో తెలుసా?

రోజాకే షాక్‌ ఇచ్చేలా పనిచేస్తున్నారట.ఎమ్మెల్యే చెప్పే మాటలను కొందరు ఎడమ చెవితో విని కుడి చెవితో బయటకు వదిలేస్తుంటే.

Advertisement

 ఇంకొందరైతే తమ కార్యాలయాల్లో అవినీతి దుకాణాన్నే తెరిచేశార‌ని.వైసీపీ నాయ‌కుల ద‌గ్గ‌ర కూడా లంచాలు తీసుకుంటున్నార‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది.

ఇక‌, మ‌రికొంద‌రు మంత్రి పెద్దిరెడ్డి చెప్పిన‌ట్టు చేస్తున్నార‌ని స‌మాచారం.దీంతో రోజా పెట్టుకున్న `అభివృద్ధి` ల‌క్ష్యం ముందుకు సాగ‌క‌పోగా.

నియోజ‌క‌వ‌ర్గంలో అవినీతి అధికారు లు పెరిగిపోయార‌ని ప్ర‌జ‌లు, సొంత పార్టీ నేత‌లు అంటున్నారు.మ‌రోవైపు.

రోజా.దందాలు చేసేందుకే త‌న‌కుఅనుకూలంగా ఉండే అధికారుల‌ను తెచ్చుకున్నార‌ని టీడీపీ నేత‌లు.సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ముమ్మ‌రం చేస్తున్నారు.

ఫ‌లితంగా రోజాకు క‌ష్టాలు మ‌రిన్ని పెరిగిపోయాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.మ‌రి జ‌బ‌ర్ద‌స్త్ రోజా.

ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.

తాజా వార్తలు