కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రోజా.. కూతురివి మాత్రమే కాదంటూ?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన రోజా మంత్రి పదవి దక్కడంతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

తనకు ఊహించని స్థాయిలో పాపులారిటీ రావడానికి కారణమైన జబర్దస్త్ షోకు కూడా ఆమె గుడ్ బై చెప్పారు.

రోజా ప్రస్తుతం ఒకవైపు పొలిటికల్ కార్యక్రమాలతో బిజీ అవుతూనే మరోవైపు రోజా కుటుంబానికి కూడా సమయం కేటాయిస్తున్నారు.తాజాగా రోజా కూతురు గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

రోజా కూతురు అన్షు మాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.ఈరోజు అన్షు మాలిక పుట్టినరోజు కాగా తన టాలెంట్ తో అన్షుమాలిక ఇప్పటికే ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు.

డియర్ అన్షు. నువ్వు నా కూతురివి మాత్రమే కాదు.

Advertisement

మంచి ఫ్రెండ్ వి కూడా.నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్.

నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అన్షు అంటూ రోజా పోస్ట్ పెట్టారు.

కూతురు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు దిగిన వేర్వేరు ఫోటోలను రోజా పంచుకుంటూ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.రోజా చేసిన పోస్ట్ కు 12,000కు పైగా లైక్స్ వచ్చాయి.కూతురి పుట్టినరోజు వేడుకలను ప్రతి సంవత్సరం రోజా గ్రాండ్ గా జరుపుతారు.

అన్షుమాలిక కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఆమె అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అన్షు మాలిక కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.హీరోయిన్ కు అవసరమైన అన్ని లక్షణాలు ఆమెకు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.రోజా భవిష్యత్తులో మంత్రి పదవి దూరమైతే మళ్లీ సినిమాలు, టీవీ షోలపై దృష్టి పెడతారో లేదో తెలియాల్సి ఉంది.

Advertisement

రోజా సినిమాలు, టీవీ షోల ద్వారా పది కోట్ల రూపాయలకు అటూఇటుగా ఆస్తులు కూడబెట్టారని బోగట్టా.