ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీసిన లాడెన్ ఎట్టకేలకు చిక్కడంతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.అదేంటి లాడెన్ ఎప్పుడు చచ్చిపోయాడు కదా ? ఇప్పుడు సంబరాలు చేసుకోవడం ఏమిటి అనే కదా మీ డౌట్ ! అయితే ఈ వార్త మీరు చదవాల్సిందే ! అసోంలోని గోల్పారా జిల్లాలో చాలా కాలంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఎంతోమంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఏనుగుని ఎట్టకేలకు అధికారులు చాకచక్యంగా, ఎటువంటి నష్టం జరగకుండా బంధించగలిగారు.
ఆ ఏనుగు ప్రజల ప్రాణాలు తీస్తుండడంతో దానికి లాడెన్ అనే పేరు పెట్టారు స్థానికులు.
ఈ లాడెన్ బారినపడి అక్టోబర్ నెలలోనే ఐదుగురు గ్రామస్తులు ప్రాణాలు కోల్పోయారట.ఇక ఈ ఏనుగును పట్టుకోవడానికి అధికారులు చాలా ఏర్పాట్లే చేసుకున్నారు.డ్రోన్ కెమెరా లతోపాటు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులను కూడా ఉపయోగించి నిపుణులైన వ్యక్తుల ద్వారా మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు.
ఇక ఈ ఏనుగును దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ఏనుగు పీడ విరగడవ్వడంతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy