ఏలూరులో రోడ్డుప్రమాదం.. ఒకరు మృతి

ఏలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది.చేబ్రోలు హైవే వద్ద అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది.

ఈ ఘటనలో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానకీరామ్ కు తీవ్రగాయాలు కాగా.ఆయన భార్య ఉషశ్రీ మృతిచెందారు.

డ్రైవర్ కు కూడా తీవ్రగాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం

తాజా వార్తలు