మీ ఇంట్లో టీవీ ఫ్రిజ్ సోఫా ఏ దిక్కున పెడితే కలిసి వస్తుందో తెలుసా..?

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.

నిజానికి ఇంట్లో వాస్తు ప్రకారం అన్ని సరిగా ఉంటేనే మంచిదని నమ్మేవారు ఎంతోమంది ఉన్నారు.

ఇంట్లో కొన్ని వస్తువుల స్థానాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.అవి అటు ఇటు ఉండడం వల్ల కూడా మనకు నష్టాన్ని తెచ్చి పెడతాయి.

వాస్తు ప్రకారం( Vastu Shastra ) అంతా బాగానే ఉంటే ఇంట్లో సంతోషమైన సుఖమైన జీవితాన్ని గడపవచ్చు.లేనిపక్షంలో పేదరికం తాండవం చేస్తుంది.

ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇంట్లో కొన్ని వస్తువుల స్థలాన్ని మార్చాలి.వాస్తు దోషం ఉన్నప్పుడు డబ్బు కొరత, నిరాశ, ఎంత ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండకపోవడం వంటివి జరుగుతాయి.

Advertisement

కాబట్టి ఇంట్లో వాస్తు అనేది కాస్త సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.సాధారణంగా అందరి ఇళ్లలో టీవీ, ఫ్రిడ్జ్, సోఫా, మిక్సీ, గ్రైండర్ వంటి సామాగ్రి ఉంటుంది.

ఈ వస్తువులను ఇంట్లో ఉంచడం విషయంలో చాలామంది వాస్తును పట్టించుకోరు.వారి స్థానానికి సరిపడా ఎక్కడ అయితే బాగుంటుందో అక్కడ సెట్ చేసుకుంటారు.

కానీ ఈ వస్తువులు కూడా సరైన దిశలోనే ఉండాలి.లేదంటే వాస్తు దోషాలను( Vastu Dosham ) కలిగిస్తాయి.

మరి వాస్తు ప్రకారం టీవీ, ఫ్రీజ్ వంటి వస్తువులు ఎక్కడ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రస్తుత సమాజంలో టీవీ అనేది చాలామంది ఇళ్లలో కచ్చితంగా ఉంటుంది.

Hair Growth Treatment : ఈ రెండు ప‌దార్థాల‌తో పొడ‌వాటి జుట్టును పొందొచ్చు.. తెలుసా?

టీవీ లేని ఇల్లు దాదాపు ఉండదు అని చెప్పవచ్చు.టీవీతో కాలక్షేపం బాగా జరుగుతుంది.

Advertisement

వాస్తు ప్రకారం టీవీ( Vastu for TV )ని ఇంటి తూర్పు దిశలో ఉంచి చూడడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది.టీవీ ఈ దిశలో పెట్టడం వల్ల ఇంట్లోనీ వ్యక్తులు ఆనందంగా ఉంటారు.

అలాగే ప్రస్తుత సమాజంలో దాదాపు అందరి ఇళ్ళలో ఫ్రిడ్జ్( Vastu for Fridge ) కచ్చితంగా ఉంటుంది.దీన్ని ఒక నిత్యవసర వస్తువుగా భావిస్తున్నారు.ఫ్రిడ్జ్ ను పశ్చిమ దిశలో ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న వాస్తు దేవతలు సంతోషిస్తారు.

అలాగే తలుపుల ముందు కూడా ఫ్రిడ్జ్ పెట్టకూడదు.అలాగే మైక్రోవేవ్, స్టావ్ వంటి వాటి దగ్గర కూడా దీన్ని పెట్టకూడదు.

ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది ఇళ్లలో సోఫా ఉండడం మనం చూస్తూనే ఉంటాం.వాస్తు ప్రకారం సోఫాను పశ్చిమ దిశలో ఉంచడం మంచిది.

ఇలా సోఫాను ఉంచడం వల్ల పేదరికం కూడా దూరం అవుతుంది.

" autoplay>

తాజా వార్తలు