తల్లి కాబోతున్న ప్రభాస్ హీరోయిన్.. సీక్రెట్ దాచిపెట్టామంటూ..?

లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు రిచా గంగోపాధ్యాయలీడర్ మూవీ తరువాత రిచా నటించిన నాగవల్లి యావరేజ్ రిజల్ట్ అందుకోగా మిరపకాయ్, మిర్చి సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

మిర్చి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన రిచా ఇతర భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు.

అయితే నటిగా వరుస అవకాశాలు వస్తున్న తరుణంలోనే రిచా సినిమాలకు గుడ్ బై చెప్పారు.

Richa Gangopadhyay Announce Her Preganancy In Social Media , Mirchi Movie, Pho

ఉన్నత చదువుల కోసం సినిమాలకు దూరమైన రిచా గంగోపాధ్యాయ రెండు సంవత్సరాల క్రితం తన బాల్య స్నేహితుడు జో లాంగేల్లాను వివాహం చేసుకున్నారు.సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న రిచా తాజాగా అభిమానులకు ఒక శుభవార్త చెప్పారు.తాను గర్భవతినని ఆమె అభిమానులతో పంచుకున్నారు.

ఈ సీక్రెట్ ను కొంతకాలం నుంచి దాచిపెట్టామని ప్రస్తుతం అభిమానులందరితో ఈ రహస్యాన్ని పంచుకుంటున్నానని రిచా తెలిపారు.తన ట్విట్టర్ ఖాతా ద్వారా రిచా గంగోపాధ్యాయ ఈ విషయాలను వెల్లడించారు.

Advertisement
Richa Gangopadhyay Announce Her Preganancy In Social Media , Mirchi Movie, Pho

రిచా ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పడంతో అభిమానులు ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.బేబీ బంప్ తో దిగిన ఫోటోను రిచా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

సినిమాలకు దూరమైన తరువాత అమెరికాలో ఎంబీఏ చదివిన రిచా గంగోపాధ్యాయ సినిమాలకు దూరంగా ఉన్నా ప్రేక్షకులకు మాత్రం దగ్గరగానే ఉన్నారు.నటిగా రిచా తెలుగులో కెరీర్ ను కొనసాగించి ఆమె కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తెలుగులో రిచా గంగోపాధ్యాయ నాగార్జున హీరోగా నటించిన భాయ్ సినిమాలో చివరగా నటించారు.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

భవిష్యత్తులో రిచా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు