రెచ్చగొడుతున్న ఆర్జీవి! లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం కొత్త ఎత్తులు!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్ కోసం ఎంతైనా తెగించడానికి రెడీ అవుతాడు అనే విషయం అందరికి తెలిసిందే.

ఇప్పుడు మరో సారి తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం కొత్త ఎత్తులు వేస్తున్నాడు.

మహానటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయనకి జరిగిన అవమానం, వెన్నుపోటు, లక్ష్మి పార్వతి ఎంట్రీకి సంబంధించిన కీలక ఘట్టాలని తెరపై ఆవిష్కరించాడు.ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు.

ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ ఊహించని విధంగా రికార్డ్ స్థాయిలో 4 మిలియన్ వ్యూస్ ని కేవలం ఒక్క రోజులో తెచ్చుకొని, తెలుగు ప్రేక్షకులని భాగా ఆకట్టుకుంటుంది.ఇక ఈ ట్రైలర్ లో పూర్తిగా చంద్రబాబుని, నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఆర్జీవి వారిని నెగిటివ్ గా రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేసాడు.

దీంతో ఈ సినిమా మీద తెలుగు దేశం పార్టీ నాయకులు సీరియస్ అయ్యే అవకాశం వుందని అందరూ భావించారు.అలాగే ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆందోళన చేసే అవకాశం వుందని అనుకున్నారు.

Advertisement

ఎన్టీఆర్ అభిమానులు గాని, తెలుగు దేశం పార్టీ నాయకులు గాని లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్పందిస్తే అది కచ్చితంగా పెద్ద వివాదంగా మారి సినిమాకి భాగా ప్రమోషన్ అవుతుంది.ఇక చానల్స్ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఎవరైనా స్పందిస్తారేమో అని భావించారు.

అయితే తెలుగు దేశం పార్టీ శ్రేణులలో ఎవరు ఈ సినిమాపై నోరు మెదపలేదు.అయితే ఆర్జీవి అదే పనిగా ట్విట్టర్ లో తెలుగు దేశం పార్టీ శ్రేణులని రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన కూడా ఎవరు స్పందించలేదు.

అయితే మరో సారి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై ఆర్జీవి తన స్టైల్ లో వీడియో రిలీజ్ చేసాడు.ఇందులో తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి కారణం చెప్పాడు.

అయితే ఓ వైపు అగ్గికి ఆజ్యం పోస్తున్నట్లు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఆర్జీవి ఎన్ని విధాలుగా రెచ్చగొడుతున్న ప్రస్తుతానికి అయితే పెద్దగా ప్రయోజనం లేదు.మరి మహానాయకుడుతో పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్న ఆర్జీవి ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మనిషి చివరి క్షణాలలో.. ఈ వస్తువులు దగ్గర్లో ఉంటే స్వర్గం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు