పవన్ ఫ్యాన్స్ ను కెలకడం ఇష్టం.. వైరల్ అవుతున్న ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) సక్సెస్ రేట్ చాలా తక్కువనే సంగతి తెలిసిందే.

అయితే వివాదాల ద్వారా, ప్రమోషన్స్ ద్వారా, పబ్లిసిటీ ద్వారా, బోల్డ్ కంటెంట్ ద్వారా తన సినిమాలపై అంచనాలను పెంచే విషయంలో మాత్రం వర్మకు ఎవరూ సాటిరారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

పవన్ అభిమానులను రెచ్చగొట్టేలా వర్మ పెడుతున్న పోస్ట్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

తాజాగా ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్( Pawan Kalyan fans ) గురించి వర్మ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు.పవన్ కళ్యాణ్ అభిమానులను కెలకడం, వాళ్లతో ఆడుకోవడం తనకు ఇష్టమని సోషల్ మీడియాలో ఫ్లాట్ ఫార్మ్స్ లో పవన్ ఫ్యాన్స్ ను కెలకటానికి అసలు కారణం ఇదేనని వర్మ అన్నారు.

నేను చేసిన ట్వీట్లను కనీసం చదవకుండా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్లు చేస్తారని వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.నేను ఇంగ్లీష్ లో రాసే సెంటెన్స్ లు వాళ్లకు అర్థం కావని రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు.

Advertisement

పవన్ పై నేను విమర్శలు చేయలేదని సెటైర్లు మాత్రమే వేశానని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.వెన్నుపోటు ఉదంతం వల్ల చంద్రబాబు అంటే తనలో నెగిటివిటీ ఉందని ఆయన కామెంట్లు చేశారు.

సీఎం జగన్ కు అనుకూలంగానే వ్యూహం సినిమా( Vyuham Telugu Movie ) ఉంటుందని ఆర్జీవీ చెప్పుకొచ్చారు.దాసరి కిరణ్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అని వర్మ తెలిపారు.జగన్ మాటతీరు, బాడీ లాంగ్వేజ్ నచ్చాయని జగన్ పాలన ఎలా ఉందనేది నాకు అనవసరం అని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

తన సినిమాలో జగన్ రోల్ ఉండటం వల్లే ఆయనను కలిశానని ఆర్జీవీ పేర్కొన్నారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు