కులాల ప్రస్తావన తెచ్చి రెచ్చగొడుతున్న ఆర్జీవి

ఎన్టీఆర్ జీవితంలో కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ విషయంలో అడ్డు పడిన తెలుగు దేశం పార్టీ మీద, అలాగే శ్రీ రెడ్డి ఇష్యూలో మెగా ఫ్యామిలీ ఆర్జీవి మీద చేసిన వాఖ్యాల మీద ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ప్రతీకారం తీర్చుకుంటూ వరుసగా వివాదాస్పద ట్వీట్ లతో రెచ్చిపోతున్నాడు.

జగన్ అధికారంలోకి రావడంతో అతను తనకి అండగా నిలబదతాడని ధైర్యంతో ఆర్జీవి కులాలని రెచ్చగొట్టే విధంగా వరుసగా వాఖ్యలు చేస్తూ టీడీపీ పార్టీ నేతలని చౌదరీలకి కోపం తెప్పిస్తున్నాడు.

ఇప్పటికే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తీయబోతున్న అంటూ సంచలన వాఖ్యలు చేసిన ఆర్జీవి తాజాగా మరో సారి రెచ్చిపోయాడు.ప్రస్తుతం ఏపీలో ఎండలకి భయపడి ఎవరు బయటకి రావడం లేదు అనేది అబద్ధం.

రెడ్లకి భయపడి కమ్మోళ్ళు బయటకి రావడం లేదు అంటూ వివాదాస్పద వాఖ్యలు చేసాడు.ఇప్పుడు ఇతని వాఖ్యలు కమ్మ, రెడ్లు మధ్య కులాల కుంపటిని రాజేసే విధంగా ఉన్న్నాయని చాలా మంది అంటూ ఉంటే, ఆర్జీవి సపోర్ట్ చేసిన రెడ్లు మాత్రం అతని వాఖ్యలపై మరింత ఆజ్యం పోసే విధంగా సపోర్ట్ చేసే విధంగా కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఏపీలో తన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేస్తున్న సందర్భంగా ప్రమోషన్ కోసం ఆర్జీవి ఈ స్ట్రాటజీ అంతా ప్లే చేస్తున్నాడని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement
Wsm Kundensupport Und Servicequalität Für Spieler In DE