రేవంత్ రెడ్డి 'ఒన్ మ్యాన్ షో'.. సాధ్యమేనా ?

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నేడు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

బి‌ఆర్‌ఎస్ లాంటి బలమైన పార్టీకి ధీటుగా నిలబడి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ముఖ్య పాత్ర పోషించారు.

పార్టీలో సీనియర్స్ అంతా వ్యతిరేకత చూపినప్పటికి విభేదాలు, మనస్పర్థాలు తారస్థాయిలో ఉన్న వాటన్నిటిని సరిచేస్తు అందరిని ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఒన్ మ్యాన్ షో గా పార్టీకి విజయాన్ని అందించారు.అయితే ఇకపై రేవంత్ రెడ్డి ఒన్ మ్యాన్ షో ఉంటుందా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

Revnath Reddy In The Hands Of Congress High Command, Revanth Reddy, Uttam Kumar

ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కీలక పదవిలో ఉన్నప్పటికి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, పథకాల అమలుకైనా, కొత్త విధానాలు ప్రవేశ పెట్టడానికైనా డిల్లీ పెద్దల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇటీవల కాంగ్రెస్ నేత వేణుగోపాల్ ( KC Venugopal )చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.రేవంత్ రెడ్డి సి‌ఎం గా ఉన్నప్పటికి గతంలో మాదిరి ఆయన ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదని, పార్టీ అధిష్టానం, కేబినెట్ చేర్చించిన తరువాతే ఏదైనా జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

Revnath Reddy In The Hands Of Congress High Command, Revanth Reddy, Uttam Kumar

ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే పదవి రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నప్పటికి అధికారం మాత్రం కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో( Congress high command ) ఉందనే విషయం స్పష్టమౌతుంది.మరి ఇంతవరకు తెలంగాణలో కే‌సి‌ఆర్ తన అధీనంలోనే పాలన సాగించారు.కానీ ఇకపై రేవంత్ రెడ్డి అలా కాదు తెలంగాణలో డిల్లీ పాలన సాగించాల్సి ఉంటుందనేది చాలమంది అభిప్రాయం.

Advertisement
Revnath Reddy In The Hands Of Congress High Command, Revanth Reddy, Uttam Kumar

ఎన్నికల ముందు హామీలు ప్రకటించడంలోనూ వాటిని అమలు చేయడంలోనూ తనదే బాద్యత అన్న రీతిలో వ్యవహరించిన రేవంత్ రెడ్డి.పార్టీ అధిష్టానంతో సంబంధం లేకుండా వాటి అమలుకై నిర్ణయాలు తీసుకుంటారా ? అనేది ప్రశ్నార్థకమే.ఏది ఏమైనప్పటికి మొదటి సారి ముఖ్యమంత్రి పదవిని అధిష్టించిన రేవంత్ రెడ్డి తన పాలన విధానంతో ఎలాంటి మార్పులు తీసుకొస్తారనేది అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు