రేవంత్ రెడ్డి కామెంట్స్ దొంగే దొంగ అన్నట్లుగా ఉంది..: ఎంపీ లక్ష్మణ్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్( BJP MP K.Laxman ) కౌంటర్ ఇచ్చారు.

బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయంటూ రేవంత్ రెడ్డి ( Revanth Reddy)వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై స్పందించిన లక్ష్మణ్.సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు.ఆరు నెలల్లోనే 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల స్థానాల్లో బీజేపీకి ఆధిక్యత వచ్చిందన్నారు.

మోదీ ప్రధాని ( Narendra Modi )కాకూడదని కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయమన్న ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కావడమే మిగిలిందని చెప్పారు.

తాను ఎప్పుడూ పదవుల రేసులో ఉండనన్నారు.ఎవరికీ ఏం ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిర్వర్తిస్తానని తెలిపారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు