బీజేపీ,తెరాస పై సంచలన వ్యాఖ్యాలు చేసిన రేవంత్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై జరిగిన దాడికి సంబంధించి తాజాగా మల్కాజిగిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి స్పందించారు.

తెలంగాణ బీజేపీ కెసిఆర్ అనుకూల వర్గం, వ్యతిరేక వర్గంగా చీలిందని.

అందుకే దాడికి గురైన బండి సంజయ్‌ను మురళీధర్‌రావు,విద్యాసాగర్ రావు లాంటివారు పరామర్శించలేదని.బండి సంజయ్ మీద దాడి జరగడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అధికారులను పిలిచి సమీక్షించడం వంటివి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేశారా? ఇంట్లో డబ్బులు ఉంటే సోదాలు చేయాల్సింది పోలీసులని ఈ ప్రభుత్వం సరికొత్త నిబంధనలను తీసుకువస్తుంది.పక్క రాష్ట్రం రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి భద్రత కల్పించిన కేంద్రప్రభుత్వం తమ పార్టీ ఎంపీకి మాత్రం భద్రత కల్పించలేకపోయింది.

Revanth Reddy Sensational Comments On Bjp,Trs, Revanth Reddy, Congress MP, Bandi

ఒక రాష్ట్ర అధ్యక్షడి స్థాయి పదవిలో ఉన్న ఓ వ్యక్తిపై తొలుత దాడి జరిగినప్పుడు స్పందించివుంటే ఈరోజు ఆయన మీద హత్యాయత్నం జరిగే పరిస్థితుల నేలకొనేవా? అంటూ ఆయన ప్రశ్నించారు.తెలంగాణలో బిజేపి ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అధికార పార్టీ మరియు బిజేపి తోడుదొంగలని విమర్శలు చేయడం ద్వారా కాంగ్రెస్ కు మైలేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు