CM Revanth Reddy : మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కే పరిమితం కాదంటూ రేవంత్ రెడ్డి కామెంట్స్..!!

హైదరాబాద్ లో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం( Telangana State Fire Services Headquarters ) ప్రారంభమైంది.

ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మాస్టర్ ప్లాన్ హైదరాబాద్ కే పరిమితం కాదన్న ఆయనన తెలంగాణ మొత్తానికి కావాలన్నారు.జిల్లాల నుంచి హైదరాబాద్ కు రెండు గంటల్లో చేరుకునేలా ఉండాలని తెలిపారు.

హైదరాబాద్ నుంచి ఫార్మాసిటీ తరలిపోలేదని పేర్కొన్నారు. హైదరాబాద్( Hyderabad ) ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు.

చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ 30 ఏళ్లుగా హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని వెల్లడించారు.ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Advertisement

ఈ క్రమంలోనే డ్రైపోర్టు తీసుకురావాలనేది తమ విధానమని తెలిపారు.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement