తుఫాను వేగంతో దూసుకుపోతున్న రేవంత్!

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి( Revanth Reddy ) ముఖ్యమంత్రి గా ఎన్నిక అయ్యి ఇంకా రెండు రోజులు అయ్యిందో లేదో ఆయన తీసుకుంటన్న నిర్ణయాలు , చూపిస్తున్న వేగం సగటు తెలంగాణ ప్రజలను మాత్రం అవాక్కయ్యేలా చేస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఆయన వాయు వేగంతో తీసుకుంటున్న నిర్ణయాలు వాటిని అమలు చేస్తున్న విధానం చాలామందిని ఆనందాశ్చర్యాలకు లోను చేస్తుంది అని చెప్పవచ్చు .

ఒకవైపు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే మరోపక్క కాంగ్రెస్ హామీ ఇచ్చిన 6 గ్యారంటీలపై కసరత్తు చేయటం.

ఇంకో పక్క తెలంగాణా బాక్సింగ్ క్రీడాకారిణి నికితా జరీన్( Nikhat Zareen ) రెండు కోట్ల రూపాయలు నజరానా ప్రకటించడం మరోపక్క 6 గ్యారంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని( Mahalakshmi Scheme ) కసరత్తు పూర్తి చేసి అమలులోకి తీసుకురావడం, ఇంకోపక్క కరెంటు సంబంధించిన కీలకమైన నిర్ణయాల దిశగా సమీక్ష సమావేశాలు నిర్వహించడం ఇలా జెట్ స్పీడ్ లో రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన డైనమిజాన్ని చూపిస్తున్నాయి .

Revanth Is Rushing At The Speed Of A Storm, Revanth Reddy , Mahalakshmi Scheme

సాధారణంగా సుదీర్ఘకాలం ప్రయత్నం తర్వాత సాధించిన పదవిపై కనీస సమయం కూడా రిలాక్స్ అవ్వకుండా రేవంత్ పడుతున్న కష్టం ఆయనకు ఖచ్చితంగా గొప్ప నాయకుడి గా పేరు తెస్తుంది అనడం లో మాత్రం ఎటువంటి సందేహం లేదు.రేవంత్ గనక ఇదే వేగాన్ని మునుముందు కూడా కంటిన్యూ చేస్తే సుదీర్ఘకాలం తెలంగాణకు ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం కూడా తెలంగాణ ప్రజలు ఇస్తారని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.

Revanth Is Rushing At The Speed Of A Storm, Revanth Reddy , Mahalakshmi Scheme

అయితే బలమైన ప్రతిపక్షం ఉండటం పార్లమెంట్ ఎన్నికలు కూడా తరుముకోస్తూ ఉండడంతో రేవంత్ వచ్చే నాలుగు నెలలు ( Revanth Reddy )కూడాట తన లోని అత్యంత సమర్దవంతమైన నాయకుడి ని పరిచయం చేయవలసిన అవసరం ఉంటుందని , ఇచ్చిన హామీల అమలు విషయం లో తెలంగాణ ప్రజలు ఏ మాత్రం అసంతృప్తి కి లోనూ కాకుండా అత్యంత అప్రమత్తంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ల నుంచి సలహాలు అందుతున్నాయట.

Advertisement
Revanth Is Rushing At The Speed Of A Storm, Revanth Reddy , Mahalakshmi Scheme
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

తాజా వార్తలు