ఓడిన వారికే బాధ్యతలు ! ఆ ఎన్నికలపై బీఆర్ఎస్ వ్యూహం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో( Telangana assembly election ) ఓటమి నుంచి బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.

అధికార పార్టీ కాంగ్రెస్( Congress ) ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూనే,పై చేయి సాధించే ప్రయత్నం చేస్తోంది.

దీంతో పాటు వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికలపైనా పూర్తిస్థాయిలో దృష్టి సారించింది.వీలైనంత ఎక్కువ ఎంపి స్థానాలను గెలుచుకోవడం ద్వారా బీఆర్ఎస్ సత్తా చాటుకోవాలనే పట్టుదలతో కేసీఆర్, కేటీఆర్ ( KCR ktr )లు ఉన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 38 మంది గెలుపొందారు.పార్టీ ఎమ్మెల్యేలు ఒదిన చోట వారికే బాధ్యతలు అప్పగించింది.

దీంతోపాటు పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన నియోజకవర్గలలో ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన వారికే లోక్ సభ ఎన్నికల బాధ్యతలను అప్పగించింది.

Advertisement
Responsibilities For The Losers BRS Strategy On That Election , Brs Party

ఇలా ఓటమిపైన వారిలో ఎక్కువమంది మాజీ ఎమ్మెల్యేల ఉండడంతో, వారిని నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలుగా ప్రకటించారు .ఏ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి అనే విషయంతో సంబంధం లేకుండా, నియోజకవర్గాల వారీగా కీలక నేతలు, పార్టీ క్యాడర్ తో సమావేశాలు నిర్వహించాల్సిందిగా కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు, నియోజకవర్గ ఇంచార్జీలకు ఆదేశాలు జారీ చేశారు.

Responsibilities For The Losers Brs Strategy On That Election , Brs Party

తెలంగాణ నుంచి 17 మంది ఎంపీలు లోక్ సభలో ప్రాతినిధ్యం వహిస్తుండగా, వారిలో 9 మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు .వారందరిని అందుబాటులో ఉండాలని కెసిఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే.దీంతో కేటీఆర్ కూడా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల పైనే పూర్తిగా దృష్టి సారించారు.

చేవెళ్ల ,కరీంనగర్, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై క్లారిటీ రావడంతో, ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కార్యాచరణపై దృష్టి సారించారు.దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఒక్క నియోజకవర్గంలోనూ గెలవని లోక్ సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం లేదు.

Responsibilities For The Losers Brs Strategy On That Election , Brs Party
పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

భువనగిరి, వరంగల్, మహబూబాబాద్ నియోజకవర్గల పరిధిలో పార్టీకి కేవలం ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు.ఆదిలాబాద్, జహీరాబాద్, నాగర్ కర్నూల్ పరిధిలో ఇద్దరు, నిజామాబాద్, కరీంనగర్ లోక్ సభ స్థానాల పరిధిలో ముగ్గురేసి చొప్పున బీఆర్ఎస్( BRS ) ఎమ్మెల్యేలు గెలిచారు.లోక్ సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన, ఓడిన పార్టీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, సాధించిన , కోల్పోయిన మెజారిటీ, ప్రభావం చూపించిన అంశాలు ,పార్టీ నాయకుల పరిస్థితి వంటి విషయాలపై ఇప్పటికే కేటీఆర్ ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు