పెళ్లి వార్తలపై స్పందించిన ప్రదీప్.. పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చేసాడుగా?

బుల్లితెర మేల్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు గురించి అందరికీ సుపరిచితమే.

ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

ఇక ప్రదీప్ వెండితెరపై పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా నటించి ప్రేక్షకులను సందడి చేశారు.ప్రస్తుతం బుల్లితెరపై ఎంతో బిజీగా గడుపుతున్న ప్రదీప్ పెళ్లి గురించి తరచూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది.

ప్రదీప్ పెళ్లి వయసు దాటిపోతున్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో తరచూ ఈయన పెళ్లికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే గతంలో ఇలాంటి వార్తలు ఎన్నో ప్రచారం కాగ ప్రదీప్ ఆ వార్తలపై స్పందించి తన పెళ్లి గురించి వచ్చే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

అయితే తాజాగా మరోసారి ఈయన పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇప్పటికే వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒక వార్త చెక్కర్లు కొట్టింది.

Advertisement

ప్రదీప్ ప్రముఖ డిజైనర్ నవ్య మారౌతుతో తన వివాహం జరగబోతున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలు పై స్పందించిన ప్రదీప్ తన పెళ్లి గురించి వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.తాను తన షూటింగ్ పనులతో కాస్త బిజీగా ఉండటం వల్ల ఈ విషయంపై కాస్త ఆలస్యంగా స్పందిస్తున్నానని తెలిపారు.

అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు నేను ఇంతవరకు ఆ అమ్మాయితో ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు.ప్రొఫెషన్ పరంగా మా టీం వాళ్ళు ఆమెతో మాట్లాడి ఉండవచ్చు కొన్నిసార్లు నన్ను ట్యాగ్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పటివరకు తాను ఒక్కసారి కూడా తనతో మాట్లాడలేదని తనతో నా పెళ్లి అంటూ వచ్చే వార్తలలో నిజం లేదని ఈయన కొట్టి పారేశారు.

అలాగే తాను రెండో సినిమా కూడా చేయబోతున్నానని వచ్చే యేడాది ఈ సినిమా విడుదల కానుందని తన కొత్త సినిమా గురించి కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement
" autoplay>

తాజా వార్తలు