Black face : ఎండల దెబ్బకు ముఖం నల్లగా మారిపోయిందా.‌. 15 నిమిషాల్లో ఈజీగా రిపేర్ చేసుకోండిలా!

వేసవికాలం ప్రారంభమ‌వుతోంది.ఎండలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి.

ఈ సమ్మర్ సీజన్ లో ఆరోగ్యం మరియు చర్మం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

లేదంటే అటు హెల్త్ ఇటు స్కిన్ రెండు డ్యామేజ్ అవుతాయి.

ముఖ్యంగా ఈ ఎండల్లో అరగంట తిరిగారంటే చాలు ముఖం నల్లగా ( Black face )కాంతిహీనంగా మారిపోతుంది.అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.

కానీ టెన్షన్ వద్దు ఇప్పుడు చెప్పబోయే సింపుల్ హోమ్ రెమెడీని పాటించారంటే కేవలం 15 నిమిషాల్లో ఎండల దెబ్బకు నల్లగా మారిన ముఖ చర్మాన్ని రిపేర్ చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు అన్నం గంజిని( Rice porridge ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemon juice ), రెండు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ పీల్ పౌడర్ ( Orange Peel Powder ) మరియు పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.గంజి, నిమ్మరసం, ఆరెంజ్ పీల్‌ పౌడర్ మరియు పసుపులో ఉండే పలు సుగుణాలు నల్లగా మారిన చర్మాన్ని రిపేర్ చేస్తాయి.టాన్ ను రిమూవ్ చేస్తాయి.

స్కిన్ ను నిమిషాల్లోనే వైట్ గా, బ్రైట్ గా మారుస్తాయి.అలాగే ఈ రెమెడీని తరచూ పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

పైగా ఆరెంజ్ పీల్ పౌడ‌ర్ లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.ఇది చర్మాన్ని కాంతివంతంగా మరియు ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది.ఆరెంజ్ పీల్ పౌడర్ లో ఉండే బ్లీచింగ్ ప్రభావం చ‌ర్మంపై ఏర్పడే పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ను మాయం చేయ‌డంలో సహాయపడుతుంది.

Advertisement

మ‌రియు చ‌ర్మంపై అధిక ఆయిల్ ఉత్ప‌త్తిని సైతం త‌గ్గిస్తుంది.

తాజా వార్తలు