సినిమాలో ఎంట్రీ కోసం దర్శకులకి సిగ్నల్ ఇస్తున్న రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి రేణుదేశాయ్.

ఆ సినిమా తర్వాత ఆమె పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోతుందని అందరూ భావించిన అలాంటిది జరగలేదు.

పవన్ కళ్యాణ్ తో ప్రేమాయణం, డేటింగ్ కారణంగా పూర్తిగా సినిమాలు వదిలేసింది.మళ్ళీ పవన్ కళ్యాణ్ కి జోడీగానే జానీ సినిమాలో నటించింది.

Renu Desai Confirms Her Re-entry In Tollywood, Telugu Cinema, South Cinema, Pawa

ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ని పెళ్లి చేసుకున్నాడు.తరువాత కొంత కాలానికి మరల ఇద్దరు విడిపోయారు.

ఆమె తన స్వస్థలం పూణే వెళ్ళిపోయింది.అక్కడ పిల్లలతో ఉంటూ ఓ సినిమాకి దర్శకత్వం కూడా వహించింది.

Advertisement

అలాగే రియాలిటీషోలకి వెళ్తూ సినిమా రంగానికి దగ్గరగానే ఉంది.మరల ఈ మధ్య కాలంలో ఆమె మరింతగా యాక్టివ్ అవుతుంది.

నటిగా రీ ఎంట్రీ ఇవ్వాలని చాలా రోజులు నుంచి ఎదురుచూస్తుంది.ఆ మధ్య పూరీ జగన్నాథ్ ని తన సినిమాలో ఒక మంచి రోల్ ఇవ్వాలని రేణు దేశాయ్ అడిగింది.

ఈ మధ్య జీతెలుగు సీరియల్స్ కి సంబంధించి ఒక యాడ్ రిలీజ్ చేశారు.అందులో రేణు దేశాయ్ నటించింది.

ఈ యాడ్ లో నటించడం ద్వారా మరల తాను నటిగా ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ దర్శకులకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.ఓ ప్రముఖ దర్శకుడు సినిమా లో స్టార్ హీరోకి అక్కగా నటించడానికి రేణుదేశాయ్ ఇప్పటికే ఓకే చెప్పినట్లు కూడా టాక్ వినిపిస్తుంది.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!

ఇక పూరీ కూడా తన నెక్స్ట్ సినిమాలో రేణు దేశాయ్ కి అదిరిపోయే రోల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే చాలా మంది సీనియర్ హీరోయిన్స్ తల్లి పాత్రలతో పాటు, ఇతర కీలక పాత్రల కోసం రంగంలోకి దిగారు.

Advertisement

మరి రేణు దేశాయ్ ని అలా పరిచయం చేసే దర్శకుడు ఎవరనేది వేచి చూడాలి.

తాజా వార్తలు