ఆనంద్ మహీంద్రాను ఆశ్చర్యపోయేలా చేసిన రిమోట్ కార్ గేట్... ఏంటబ్బా అది?

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్, ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఏ విధంగా యాక్టివ్ గా ఉంటాడో తెలిసిన విషయమే.

ఆయన చమత్కారమైన పోస్ట్‌లను పంచుకోవడంతో పాటుగా, వినూత్నమైన ఆవిష్కరణలను కూడా తమ ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులతో పంచుకుంటూ ఉంటాడు.

అతను తాజాగా ఓ వినూత్న ఐడియాతో గేట్ తయారు చేసిన ఓ వానర్ ని సెలిబ్రిటీని చేసాడు.అవును.

కారుని తన ఇంటికి గేట్ గా వాడిన విధానాన్ని కీర్తిస్తూ ఓ అద్భుత ఆవిష్కరణ అని కొనియాడుతూ ఓ పోస్ట్ పెట్టారు.సదరు వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, ఒకతను సడెన్ గా ఓ కారు డోరుని ఓపెన్ చేసుకొని తన ఇంటినుండి బయటకు వస్తాడు.

వచ్చినవెంటనే ఓ రిమోట్ నొక్కగా ఆ కారు డోర్ మూసుకొని పోతుంది.ఓస్ అంతేగా? కార్లు అలాగే వుంటాయని అనుకుంటారేమో.అక్కడే పప్పులో కలిసినట్టు.

Advertisement

అతను నిజంగా కారులోనుండి రాలేదు.మీరు బాగా గమనిస్తే.

ఓ కారు బాడీతో చేయబడిన ఇంటి గేట్ ని తెరుచుకొని బయటకు వచ్చాడు చూడండి.మహీంద్రానా మజాకా.

ఓ సాధారణ విషయాన్ని అతను అలా ప్రమోట్ చెయ్యరు.అది అసాధారణం అయితేనో లేదంటే ఏదన్నా కొత్తగా ఉంటేనో అలా పోస్ట్ చేస్తారు.

ఇకపోతే ఇలాంటి పోస్టులు చేయడం ఆయనికి కొత్తకాదు.రోజుకి కనీసం తక్కువలో తక్కువ రెండు పోస్టులు అయినా పోస్ట్ చేయాల్సిందే.ఇక మహీంద్రా పోస్టులు కోసం ప్రత్యేకంగా వెతికే అభిమానులు ఆయనికి వుంటారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

ఇక మహీంద్రా ట్వీట్ కి కొందరు నెటిజన్లు లైకులు వర్షం కురిపిస్తున్నారు.ఇప్పటివరకు ఆ పోస్ట్ మూడు లక్షల వీక్షణలు పొందింది.

Advertisement

అలాగే 12 వేలమంది దాన్ని లైక్ చేసారు.ఇప్పటివరకు దాదాపు 1100 దాన్ని రీట్వీట్ చేయడం జరిగింది.

ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.మీరు కూడా సదరు వీడియోని చూసి అభిప్రాయాన్ని తెలియజేయండి.