జియోకు ఊహించని రీతిలో పెరిగిన సబ్‌స్క్రైబర్లు.. ఆ కంపెనీకి కోలుకోలేని నష్టం

టెలికాం రంగంలో జియో ( Jio ) తన దూకుడు కొనసాగిస్తోంది.ఎప్పటికప్పుడు తన మార్కెట్‌ను పెంచుకుంటూ పోతోంది.

తాజాగా భారీగా సబ్‌స్క్రైబర్లను( Subscribers ) పెంచుకుంది.ప్రత్యర్థి కంపెనీలకు షాక్ ఇస్తూ కొత్తగా 10 లక్షల సబ్‌స్క్రైబర్లను పొందింది.మరో వైపు ఎయిర్‌టెల్ కూడా కాస్త పుంజుకుంది.9.82 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను ఇటీవల కాలంలో ఎయిర్ టెల్ సంస్థ పొందింది.అయితే మిగిలిన కంపెనీలకు భారీ షాక్ తగిలింది.

ఊహించని రీతిలో అవి తమ సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గురువారం విడుదల చేసిన డేటాలో ఈ విషయాన్ని వెల్లడించింది.

ట్రాయ్ ప్రకారం, దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీ జియో ఫిబ్రవరిలో గరిష్టంగా 10 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను జోడించింది.దీనితో, దాని మొత్తం చందాదారుల సంఖ్య జనవరిలో 42.61 కోట్ల నుండి ఫిబ్రవరిలో 42.71 కోట్లకు పెరిగింది.సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌టెల్( Airtel ) ఫిబ్రవరి నెలలో 9.82 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పొంది, మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ 36.98 కోట్లకు చేరుకుంది.ట్రాయ్ నివేదికల ప్రకారం, వొడాఫోన్ ఐడియా( VI ) 2 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది.దీంతో దాని మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్ 23.79 కోట్లకు తగ్గింది.

Advertisement

బ్రాడ్‌బ్యాండ్ చందాదారుల మొత్తం మార్కెట్ వాటాలో మొదటి ఐదు సర్వీస్ ప్రొవైడర్లు 98.38 శాతం వాటా కలిగి ఉన్నారు.ఈ సర్వీస్ ప్రొవైడర్లలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (43.52 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు), భారతీ ఎయిర్‌టెల్ (23.97 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.374 కోట్లు), BSNL (2.492 కోట్లు), అట్రియా కన్వర్జెన్స్ (సుమారు 21 లక్షల మంది కస్టమర్లు) ఉన్నారని ట్రాయ్ తెలిపింది.ఈ కాలంలో జియో అత్యధికంగా లాభపడింది.ఫిబ్రవరి 2023లో, 10 లక్షల మంది కొత్త కస్టమర్‌లు జియో నెట్‌వర్క్‌కి కనెక్ట్ అయ్యారు, ఆ తర్వాత కంపెనీ మొత్తం కస్టమర్ల సంఖ్య 42.71 కోట్లకు చేరుకుంది.జనవరిలో జియో మొత్తం సబ్‌స్క్రైబర్లు 42.61 కోట్లుగా ఉంది.

మోకాలి నొప్పులు నివారించాలంటే.. ఇలా చెయ్యండి..!
Advertisement

తాజా వార్తలు