తెలంగాణ టెన్త్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌

తెలంగాణ‌లో ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి.సైఫాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయంలో ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన విడుదల చేశారు.

ఫలితాల్లో 79.82 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు.మొత్తం 48,167 మంది సప్లమెంటరీ పరీక్షలకు హాజ‌రు కాగా.38,447 మంది ఉత్తీర్ణులయ్యారు.బాలికలు 82.21 శాతం, బాలురు 78.42 శాతం ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు.అదేవిధంగా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులు సెప్టెంబర్ 3 నుంచి 12 లోపు అప్లై చేసుకోవచ్చని పేర్కొన్నారు.రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు రూ.500 , రీ వాల్యువేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాలని స్ప‌ష్టం చేశారు.