పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ విడుదల

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది.డిసెంబర్ 7 వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభంకానున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

డిసెంబర్ 29 వరకు ఉభయసభల సమావేశాలు కొనసాగనున్నాయి.అదేవిధంగా ఈ సమావేశాల్లో మొత్తం 17 పని దినాలు ఉంటాయని వెల్లడించారు.

Release Of Schedule Of Winter Session Of Parliament-పార్లమెంట�

రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ ఎగువ సభలో కార్యకలాపాలను నిర్వహించే తొలి సెషన్ కావడం గమనార్హం.కాగా పార్లమెంట్ సమావేశాల కంటే ముందే ఈనెల 21వ తేదీన ప్రి బడ్జెట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు.2023-24 ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీకి సూచనలు కోరుతూ సమావేశాలను నిర్వహించనున్నారు.

పెట్రోలియం జెల్లీని ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు