Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha Elections ) నోటిఫికేషన్ విడుదల అయింది.మొత్తం 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.ఏపీలో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల15వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.

అలాగే ఈనెల 27న పోలింగ్ నిర్వహించనున్న అధికారులు అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు.కాగా ఏపీలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కనకమేడల రవీంద్రబాబు, సీఎం రమేశ్ బాబు ( Vemireddy Prabhakar Reddy, Kanakamedala Ravindra Babu, CM Ramesh Babu )పదవీ కాలం ముగియనున్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ 2వ తేదీన వీరు పదవీ విరమణ చేయనున్నారు.

కాగా ఇవాళే ముగ్గురు అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రకటించింది.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు