కర్ణాటక ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది.ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను ప్రకటించారు.

గ్యారండీ కార్డు పేరుతో కాంగ్రెస్ ఐదు హామీలను ఇచ్చింది.గృహా జ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, గృహాలక్ష్మీ పథకం కింద ప్రతి ఇంటికి రూ.2 వేలు, అన్న భాగ్య పథకం కింద పది కేజీల బియ్యంవంటి హామీలతో నిరుద్యోగ యువతకు భరోసా కల్పించే విధంగా యువనిధి పథకం, మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే విధంగా కల్పించే అవకాశాన్ని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.కర్ణాటక అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని హాస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నేతలందరూ కర్ణాటకలో జోరుగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021
Advertisement

తాజా వార్తలు