Red Onions vs White Onions : ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదంటే..?

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దవాళ్లు సామెత చెబుతూ ఉంటారు.ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలును చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.

అయితే ఉల్లి( Onions ) లేకుండా వంట గది ఊహించడం కూడా అసాధ్యం.అలాగే ఉల్లి లేకుండా ఒక్క వంటకాన్ని కూడా చేయలేము.

అందుకే ఇంట్లో ఖచ్చితంగా ఉల్లి నిల్వ ఉండేలా చూసుకోవాలి.ఉల్లి ధరలు పెరిగితే అది పెద్ద వార్త అవ్వడానికి అదే కారణమవుతుంది.

అయితే సాధారణంగా మనకు మార్కెట్లో రెండు రకాల ఉల్లిపాయలు కనిపిస్తాయి.వీటిలో ఒకటి తెల్ల ఉల్లిగడ్డ అయితే, మరొకటి ఎర్ర ఉల్లిగడ్డ.

Advertisement

అలాగే పట్టణాల్లో దాదాపు మనం ఎర్ర ఉల్లిగడ్డలని ఉపయోగిస్తాము.చాలా తక్కువ మాత్రమే తెల్ల ఉల్లి గడ్డలు కనిపిస్తాయి.

అయితే గ్రామాల్లో మాత్రం ఎక్కువ గా తెల్ల ఉల్లిగడ్డను చూస్తూ ఉంటాము.ఇంతకీ ఈ రెండింటిలో ఏది మంచిదో( White Onion vs Red Onion ) ఏ ఉల్లిగడ్డ వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా ఎర్ర ఉల్లిగడ్డతో పోల్చితే తెల్ల ఉల్లిగడ్డ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది.దీనికి ప్రధాన కారణం తెల్ల ఉల్లిగడ్డ వల్ల కలిగే ప్రయోజనాలే అని చెప్పవచ్చు.

తెల్ల ఉల్లిపాయలలో( White Onions ) ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి.ఇందులో ఎక్కువగా విటమిన్‌ సి( Vitamin C ), ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా తెల్ల ఉల్లిగడ్డ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

తెల్ల ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ రక్తం లోని షుగర్ స్థాయిలను నియంత్రిస్తాయి.దీంతో ఈ ఉల్లిగడ్డను క్రమం తప్పకుండా తీసుకుంటే మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చు.

Advertisement

అంతేకాకుండా తెల్ల ఉల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి.ముఖ్యంగా శరీరంలో ఏర్పడే కనితిల పెరుగుదలను నిరోధిస్తాయి.తెల్లుల్లిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను( Cholesterol Levels ) కూడా తగ్గిస్తాయి.

అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.అధిక రక్తపోటును తగ్గించడానికి రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి కూడా తెల్ల ఉల్లి ఎంత గానో సహాయపడుతుంది.

తాజా వార్తలు