Reba Monica John: బ్రో మూవీ మిస్ చేసుకున్నా ఈ సినిమా వల్ల హ్యాపీగా ఉన్నాను: రెబా మోనికా

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు, రెబా మోనిక్ జంటగా నటించిన తాజా చిత్రం సామజవరగమన.

( Samajavaragamana Movie ) అనిల్ సుంకర, సాయి రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

గత నెల జూన్ 29న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 40 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ టాక్ ని అందుకుంది.ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యింది.

ఇందులో హీరో శ్రీవిష్ణు, నరేష్ మధ్య కామెడీ టైమింగ్‌ అదుర్స్ అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ రెబా మోనిక్( Reba Monica John ) తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ బ్రో సినిమాతో( Bro Movie ) తనకు ఉన్న కనెక్షన్ గురించి కూడా చెప్పుకొచ్చింది.

Advertisement

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.మొదటి సినిమాతోనే నన్ను ఎంతో ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు చాలా కృతజ్ఞతలు.

నేను మలయాళీని, చదువు పూర్తయ్యాక మలయాళంలో కొన్ని సినిమాలు చేశాను.ఇందులో ఫారెన్సిక్ సినిమాకు గాను మంచి గుర్తింపు దక్కింది.

తెలుగులో థియేటర్స్‌లో రిలీజైన మొదటి చిత్రం సామజవరగమన అని ఆమె చెప్పుకొచ్చింది.

బ్రో మూవీ కోసం లుక్ టెస్ట్‌ వచ్చినపుడు మరొక ఫ్రెండ్ ద్వారా సామజవరగమన నిర్మాత రాజేష్ గారిని కలిశాను.కథ నచ్చడంతో సినిమా చేసేశాను.నిజానిక బ్రో మూవీలో చేయకపోయినా సామజవరగమన వంటి మంచి చిత్రం చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అని ఆమె వెల్లడించింది.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!

ఆ సినిమాను మిస్ చేసుకున్నప్పటికీ సామజవరగమన సినిమా చేసినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఆమె తెలిపింది.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా రెబా మోనిక్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

ఈ సినిమాతో హీరో శ్రీ విష్ణు( Hero Sri Vishnu ) మరో హిట్టు సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.

తాజా వార్తలు