రావి చెట్టును పూజించడం వల్ల కలిగే శుభాలు

మన హిందూ మతంలో రావిచెట్టును పూజించటం అనేది ఒక ఆచారంగా ఉంది.ప్రతి దేవాలయంలోను రవి చెట్టు ఉంటుంది.

రావిచెట్టును భగవంతుని రూపంగా కొలుస్తారు.మన హిందూ ధర్మంలో ఉన్న ఆచారాలు చాలా వరకు ఆరోగ్యపరమైనవి.

రావిచెట్టు రాత్రి పూట ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది.రాత్రి పూట ఆక్సిజన్ అందించే అతి తక్కువ చెట్లలో రవి చెట్టు ఒకటి.

గాలిలో ఉన్న అనేక రకాల బ్యాక్టీరియాలను నాశనం చేసే శక్తి రావిచెట్టులో ఉంది.అంతేకాక రావిచెట్టులో అనేక ఆరోగ్య ప్రయోజనాలుఉన్నాయి.

Advertisement

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ దివ్య అస్త్రాలను రావిచెట్టు మీద దాచారని పురాణాలు చెపుతున్నాయి.రావిచెట్టు మీద లక్ష్మి దేవి నివాసం ఉండుట వలన రావిచెట్టును పూజిస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

అంతేకాకుండా వివాహ సమస్యలు తీరటం,సంతాన ప్రాప్తి మరియు శని బాధలు తొలగిపోతాయి.

Advertisement

తాజా వార్తలు