తెలంగాణలో బారాసకు పవన్ సాయం అందుకోసమేనా?

ఈరోజు వరకు ఎన్డీఏ కూటమి లో భాగస్వామి నని చెప్పుకుంటున్న జనసేన అధ్యక్షుడు వాస్తవంలో మాత్రం ఆ పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగానే పరిణామాలు కనిపిస్తున్నాయి .ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మిత్రుడు తో చర్చించకుండా తెలుగుదేశానికి పొత్తు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ( Pawan kalyan )వైఖరి పై భాజాపా అధిష్టానం గుర్రుగా ఉందని ప్రచారం జరుగుతుండగా తెలంగాణ ఎన్నికలలో కూడా జనసేన పోటీకి నిలుపాలనుకుంటున్న నియోజకవర్గాల వల్ల అంతిమంగా అధికార బారాసా కు మేలు జరుగుతుందని ప్రచారం జరుగుతుండడంతో బారసా తో అంతర్గత ఒప్పందం తోనే అదికార పక్షానికి అనుకూలంగానే నిర్ణయం తీసుకున్నారంటూ ప్రచారం జరుగుతుంది.

ఎందుకంటే జనసేన పోటీకి నిలపబోతున్న 32 స్థానాలలో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్కు అనుకూలమైనవి .ఆంధ్ర సెటిలర్ల ఓటు బ్యాంకు తో పాటు ఆంధ్రమూలాలు ఉన్న ఖమ్మం జిల్లాలో( Khammam District ) కాంగ్రెస్ చాలా బలంగా ఉంది.అలాంటి చోట్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే బారాసకు మేలు జరిగే అవకాశం ఉంది.

దీని వల్ల పవన్ కి దక్కిన ప్రతిఫలం ఏమిటా అంటూ అనేక విశ్లేషణలు వస్తున్నాయి.

అయితే డబ్బుని ఆశించి జనసేనా ని ఇలాంటి నిర్ణయాలు తీసుకోరనీ మిత్రుడుగా ఉన్న తమను పట్టించుకోకుండా తెలంగాణ ఎన్నికలలో ఏక పక్షం గా వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారని, గత ఎన్నికలలో కూడా మిత్ర ధర్మాన్ని గౌరవించి తమ అభ్యర్థులని ఉపసంహరించు కున్నందుకు కూడా తగిన గౌరవం భాజపా( BJP ) నుంచి దక్కడం లేకపోవడం వల్లే కనీసం తమ అభ్యర్ధులను పోటీకి నిలిపితే తమ ఉనికిని చాటుకున్నట్లు అవుతుందన్న ఆలోచనతోనే పవన్ వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది తమ రాజకీయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న పవన్ పట్ల తమ నిర్ణయం ప్రకటించాల్సిన సమయం వచ్చిందని భాజపా అధిష్టానం గనక భావిస్తే జనసేనతో పొత్తుపెడాకులు అవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు అన్న వార్తలు వస్తున్నాయి.

Advertisement
ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

తాజా వార్తలు