ఎన్టీఆర్ కోపానికి కారణం ఏంటి!!!

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సంక్రాంతి బరిలో తన జూలు విదిల్చి ఉండేవాడు.

కానీ విది వెక్కిరించడంతో జానకిరాం మృత్యు వాత పడటం, అంతేకాకుండా కొన్ని అనివార్య కారణాల వల్ల టెంపర్ చిత్రం సంక్రాంతి బరి నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

అయితే మరో పక్క ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూరీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.మరో పక్క సినీ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వాదన ప్రకారం టెంపర్ మూవిలో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గేయా కనిపించనున్నట్లు తెలుస్తుంది.

ఇక మరో పక్క ఎన్టీఆర్ తరువాత సుకుమార్ తో ఒక సినిమా చెయ్యనున్నట్లు ఇప్పటికీ అధికారికంగా వార్తలు బయటకు వస్తున్నాయి.ఇంతవరకూ ఎలా ఉన్న సుకుమార్ పై ఎన్టీఆర్ కోపంగా ఉన్నట్లు కధ విషయం వీరిద్దరి మధ్య మనస్పద్దలు వచ్చినట్లు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వాదన.

దానికి ప్రధాన కారణం.జూనియర్ తో ఎటువంటి సినిమా తీయబోతున్నాడు.

Advertisement

అనే దానిపై కథ ఎలా ఉంటుంది అంటూ స్టోరిని సుకుమార్ రివీల్ చేశాడు.అంతేకాకుండా తండ్రికొడుకుల నేపధ్యంగా జూనియర్ మూవీ ఉంటుందని సుకుమార్ స్టోరిని లీక్ చేసినట్లు వార్తలు రావడంతో కథను ఎందుకు రివీల్ చేయాల్సి వచ్చిందంటూ సుకుమార్ పై జూనియర్ కోపంగా ఉన్నాడంట.

అంతే కాకుండా వీలైతే కథని పూర్తిగా మార్చాలని సుకుమార్ కు చెప్పినట్లు సమాచారం.ఏది ఏమైనా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళక ముందే వీళ్ళిద్దరి మధ్య యుద్దం మొదలయింది.

మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి.

మిస్ యు మై మ్యాన్... సంచలనం రేపుతున్న సమంత పోస్ట్?
Advertisement

తాజా వార్తలు