Bald Head in Men : మగవారికి బట్టతల రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!

ప్రస్తుత సమాజంలో జుట్టు రాలిపోయి, బట్టతల రావడం అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.మరి ముఖ్యంగా మగాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంది.

ఒకప్పుడు 45 లేదా 50 సంవత్సరాలు దాటిన వారిలో ఈ బట్టతల సమస్య( Bald Head ) కనిపించేది.కానీ ప్రస్తుత సమాజంలో మాత్రం 25 నుంచి 30 సంవత్సరాల వయసు వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తూ ఉంది.

దాంతో వారందరూ పెద్ద వయసు వారిలాగా కనిపిస్తున్నారు.బట్టతలను కవర్ చేయడం కోసం అనేక రకాల పాట్లు పడుతున్నారు.

కొందరు అయితే డాక్టర్ల వద్దకు క్యూ పడుతున్నారు.ఇలా రకరకాల పనులు చేసి చివరకు విసిగిపోతున్నారు.

Reason Behind Men Getting Bald Head
Advertisement
Reason Behind Men Getting Bald Head-Bald Head In Men : మగవారికి

అసలు ఈ బట్టతల రావడానికి కారణం ఏంటి చికిత్సలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.జీవన అలవాట్లు అనేవి కూడా బట్టతల వచ్చే విధంగా ప్రభావం చూపిస్తాయి.అందుకే జీవనశైలి అనేది మన ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనదని నిపుణులు చెబుతున్నారు.

నిద్రలేమి, పొగ తాగడం, మద్యపానం( Alcohol ) లాంటి అలవాట్లు చాలా ప్రమాదకరం.వీటి వల్లనే బట్టతల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మాదకద్రవ్యాల వాడకం వల్ల కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.

సరైన ఆహారం తీసుకోవడం వల్లనే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.కాబట్టి మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఒకవేళ మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు సరిగ్గా లేకపోతే జుట్టు రాలిపోతుంది( Hairfall ).ఇంకా చెప్పాలంటే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి కూడా మన జుట్టు రాలడాని ప్రభావితం చేస్తాయి.చాలా మంది జుట్టు స్టైల్ కోసం రకరకాల పరికరాలను ఉపయోగిస్తూ ఉంటారు.

Advertisement

ఎందుకంటే ఇవి జుట్టును బలహీన పరుస్తాయి.దాంతో జుట్టు విపరీతంగా రాలిపోయేందుకు అవకాశం ఉంటుంది.

అందరూ కూడా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ఆర్థిక ఇబ్బందులు( Financia Problems ), మానసిక ఇబ్బందులు, నిద్రలేమి లాంటి సమస్యలతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు.దానివల్ల మన జుట్టు విపరీతంగా రాలిపోతుంది.

జుట్టు మాత్రమే కాకుండా మీ చర్మం కూడా పాడైపోయే ప్రమాదం ఉంటుంది.కాబట్టి వీలైనంతవరకు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.

అలాగే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే అంటు వ్యాధులు కూడా జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణమని చెబుతున్నారు.

తాజా వార్తలు