అన్ స్టాపబుల్ 2 అందుకే ఆలస్యం అవుతుందా.. ఇది లేకపోతే ఎప్పుడో వచ్చేదట!

బాలకృష్ణలో ఫ్యాన్స్ మరో కోణం చూసారు అంటే దానికి కారణం అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే.ఈ షో ఆహాలో ప్రసారం అయ్యింది.

ఈ షో ద్వారానే బాలయ్య ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు.అప్పటి వరకు బయట ఎప్పుడు కనిపించిన ఎవరో ఒకరి మీద ఫైర్ అయ్యే బాలయ్యను చూసి అంతా ఈయన కోపిష్టి అని అనుకునే వారు.

కానీ ఈ షో తర్వాత బాలయ్య తనలోని చాలా కోణాలను ప్రేక్షకులకు చూపించి వారికీ మరింత దగ్గర అయ్యాడు.వెండితెరపై పదునైన డైలాగ్స్ తో దడ పుట్టించే బాలకృష్ణ.

ఆయన చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కే షో ద్వారా మాత్రా వినోదాన్ని పంచారు.ఇది ఇప్పటికే ఒక సీజన్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

ఇటు సినిమాలు చేస్తూనే బాలయ్య అన్ స్టాపబుల్ విత్ NBK షో చేసాడు.ఈ షో సూపర్ హిట్ అవ్వడంతో బాలయ్యతో మరో సీజన్ చేయించాలని ఆహా వారు అనుకుంటున్నారు.

ఇప్పటికే అన్ స్టాపబుల్ విత్ NBK 2 కోసం పనులు కూడా స్టార్ట్అయినట్టు అధికారికంగా ఆహా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ముందు నుండి అనుకుంటున్న ప్రకారం ఈ షో సీజన్ 2 ఈ ఆగష్టు చివరిలోనే స్టార్ట్ అయ్యేది.కానీ ఈ షో ఈ నెలలో రాకపోవడానికి కారణం టాలీవుడ్ నిర్మాతల బంద్ అనే తెలుస్తుంది.ఆగష్టు 1నుండి ఈ బంద్ 31 వరకు కొనసాగుతూనే ఉంది.

దీంతో బాలయ్య చేస్తున్న NBK107 కూడా షూటింగ్ వాయిదా పడింది.ఈ సినిమాను పూర్తి చేసి అప్పుడు మాత్రమే బాలయ్య ఈ షోను స్టార్ట్ చేయాలని అనుకున్నారట.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

కానీ ఈ బంద్ కారణంగా ఈ షూటింగ్ ఆగిపోవడంతో ఈ షో కూడా స్టార్ట్ అవుతూ వస్తుంది.మరి సెప్టెంబర్ 1 నుండి షూటింగులు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాను పూర్తి చేసి అప్పుడు అక్టోబర్ లో బాలయ్య ఈ షోను స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement