సావిత్రి ఇల్లు కొనడానికి కారణమిదే.. లలితా జ్యూవెలరీ ఎండీ కామెంట్స్ వైరల్!

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వ్యాపారవేత్త లలిత జ్యువెలరీ ఎండికేన్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

డబ్బులు ఊరికే రావు అన్న ఒక్క డైలాగ్ తో బాగా ఫేమస్ అవడంతో పాటు చాలామంది వినియోగదారులను ఆకట్టుకున్నాడు.

అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం కోట్లు ఖర్చుపెట్టి ఆ భారాన్ని ప్రజలపై వేయడం కంటే అదే కోట్లను ప్రజలకి ఆభరణ రూపంలో తగ్గించి ఇస్తే ఇంకా బాగుంటుంది కదా అని ఆలోచించి ఒక విప్లవాత్మక వ్యాపారవేత్తగా ఎదిగారు.ఇది ఇలా ఉంటే ఇటీవలె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు కిరణ్ కుమార్.

ఇంటర్వ్యూలో భాగంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ తనకు తెలుగు సినీ నటి మహానటి సావిత్రి ఇంటితో తనకు ఒక ఎమోషనల్ గా బాండింగ్ ఉందని తెలిపారు.

ఎంతో ఇష్టంతో మహానటి సావిత్రి బిల్లింగ్ ని కొన్నట్లు కిరణ్ కుమార్ వెల్లడించారు.సావిత్రి పేరు మీద ఆమె పిల్లలు అప్పట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని ఆ బిల్డింగ్ లో లలిత జ్యువెలరీ ఎండి కిరణ్ కుమార్ అద్దెకు ఉండేవారట.అయితే ఆ బిల్డింగ్ ని అమ్మాలి అని సావిత్రి కుటుంబ సభ్యులు అనుకున్న సమయంలో తనకు బాగా కలిసి వచ్చింది అన్న సెంటిమెంటుతో ఆ బిల్డింగ్ నీకేం కుమార్ కొన్నారట.

Advertisement

అంతేకాకుండా కిరణ్ కుమార్ కి అమ్మడం వెనుక ఒక ప్రత్యేకమైన కారణం కూడా ఉంది అని సావిత్రి కూతురు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సావిత్రి కూతురు సావిత్రికి బంగారం అంటే పిచ్చి అని, కిరణ్ కుమార్ ది బంగారు షాపు అని.అలాగే అమ్మకి కార్లు అంటే చాలా పిచ్చి ఆ పిచ్చి కిరణ్ కుమార్ గారికి కూడా ఉండేది.

అందుకే కిరణ్ కుమార్ సావిత్రి అమ్మనికీ తాను తమ్ముడు గా భావించమని చెప్పడంతోపాటు అక్క అని ఆప్యాయంగా పిలుస్తారని సెంటిమెంట్ తోనే కిరణ్ గారికి ఆ ఇల్లు విక్రయించాము అని తెలిపారు సావిత్రి కూతురు.ఇక కిరణ్ కుమార్ కూడా సావిత్రి ఇల్లు ఉండబట్టే తాను ఇంత సక్సెస్ అయినట్లు తెలిపారు.ప్రస్తుతం తన వద్ద 40 కార్లు ఉన్నాయని అంతేకాకుండా సావిత్రి ఇంట్లోనే ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు ఒకే అని కుమార్ తెలిపారు.

తాను కొన్న ఏ కారు తిరిగి మళ్లీ అమ్మలేదని ఒకప్పుడు కంటే ఇప్పుడు కార్ల మీద అంత మోజు లేదు అని కిరణ్ కుమార్ వెల్లడించారు.అలాగే తన తల్లి ఆశీర్వాదం వల్ల అంతా బాగా జరిగిందని అందుకే ఆ ఇంటిని సెంటిమెంట్ గా కొన్నాను అని తెలిపారు.

అంతే కాకుండా అందుకే అమ్మ పేరుని మార్చలేదని లలితా కార్పొరేట్ అని రాసాము గాని సావిత్రి గణేష్ అని పేరు మాత్రం అలాగే ఉంచాము అని తెలిపారు కిరణ్ కుమార్.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు