'సలార్' థియేటర్స్ ని రీప్లేస్ చేస్తున్న రవితేజ 'వెంకీ'..ఇది మామూలు దెబ్బ కాదు!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరో గా నటించిన సలార్( Salaar ) మూవీ బాక్స్ ఆఫీస్ జోరు నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది.

ఓపెనింగ్స్ లోనే సంచలనాలు క్రియేట్ చేసి మొదటి వారం లో 480 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కూడా అందుకునేలా కనిపించడం లేదు.

క్లోసింగ్ వసూళ్లు సౌత్ లో లియో మరియు జైలర్ కంటే తక్కువ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది అనే వార్తే టాలీవుడ్ ఆడియన్స్ కి మింగుడు పడడం లేదు.భారీ కాంబినేషన్ మరియు బ్లాక్ బస్టర్ టాక్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ సినిమా అనుకున్న రేంజ్ కి వెళ్ళలేదు అనే బాధ ట్రేడ్ పండితులను సైతం వెంటాడుతుంది.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా థియేటర్స్ ని నేడు విడుదలైన కొత్త సినిమాలు అధిక శాతం రీప్లేస్ చేసాయి.

కొత్త సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే మాస్ మహారాజ రవితేజ( Raviteja ) హీరో గా నటించిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం వెంకీ( Venky Movie ) రేపు గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వబోతుంది.ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి.షోస్ కి అన్నీ చోట్ల మంచి డిమాండ్ అనడం తో బయ్యర్స్ షోస్ ని పెంచుతున్నారు.

Advertisement

హైదరాబాద్ , వైజాగ్ మరియు విజయవాడ వంటి ప్రాంతాలలో సలార్ సినిమాకి కేటాయించిన కొన్ని థియేటర్స్ ని వెంకీ చిత్రం తో రీప్లేస్ చేస్తున్నారు.మరో విశేషం ఏమిటంటే రీప్లేస్ చేసి, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన వెంటనే టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోవడమే.

ఇది నిజంగా ట్రేడ్ కి పెద్ద షాక్.

ఎందుకంటే రవితేజ కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ డిమాండ్ ఉండడం ఈ మధ్య కాలం లో ఎవ్వరూ గమనించలేదు.రీ రిలీజ్ సినిమాల ట్రెండ్( Re-Release Trend ) ముగిసిపోయింది అని అందరూ అనుకుంటున్న సమయం లో వెంకీ చిత్రం సరికొత్త జోష్ ని ఇచ్చింది.ఇకపోతే వెంకీ సినిమా రీ రిలీజ్ చిత్రాలలో ఏ స్థానం లో నిలుస్తుందో చూడాలి.

కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 50 లక్షల గ్రాస్ ని రాబట్టింది.ఇక న్యూ ఇయర్ కి కుర్రాళ్ళు ఈ సినిమా కోసం ఎగబడతారు.ఎందుకంటే స్నేహితులతో కూర్చొని ఎంజాయ్ చెయ్యాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా కాబట్టి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

మరి ఈ చిత్రం రీ రిలీజ్ లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందా లేదా అనేది రేపు చూడాలి.

Advertisement

తాజా వార్తలు