కొన్ని సినిమాలను ఎన్ని సార్లు చూసిన కొత్తగానే అనిపిస్తుంది.
ఎన్ని సార్లు చూసిన మనస్ఫూర్తిగా మన రెగ్యులర్ లైఫ్ లో ఉండే కష్టాలను కాసేపు మర్చిపోయి మనస్ఫూర్తిగా నవ్వుకొని రిలాక్స్ అవుతూ ఉంటాము.
అలాంటి అద్భుతమైన చిత్రాలను ఎక్కువగా తెరకెక్కించిన ఘనత డైరెక్టర్ శ్రీను వైట్ల కి( Director Srinu Vaitla ) మాత్రమే సొంతం.ఈయన తెరకెక్కించిన సొంతం , వెంకీ , దుబాయి శ్రీను , కఁ౮ఇండ్ వంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతలా అలరించాయి మన అందరికీ తెలిసిందే.
వీటితో పాటుగా ఢీ చిత్రం( Dhee Movie ) కూడా క్లాసిక్ స్టేటస్ ని దక్కించుకున్న సినిమానే.మనకి బోర్ కొట్టినప్పుడల్లా యూట్యూబ్ లోకి వెళ్లి ఈ సినిమాలను చూస్తూ ఉంటాము.
ఇప్పుడు మనం ఢీ చిత్రం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోబోతున్నాం.ఈ సినిమా మంచు మోహన్ బాబు తనయుడు , మంచి విష్ణు కి( Manchu Vishnu ) మొట్టమొదటి సూపర్ హిట్ అని చెప్పొచ్చు.
ఈ సినిమాకి ముందు మంచు విష్ణు ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ, ఒక్క సక్సెస్ ని కూడా సొంతం చేసుకోలేకపోయాడు.అలా కెరీర్ లో డీలాపడిన మంచు విష్ణు కి ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ మామూలుది కాదు.అయితే ఈ స్క్రిప్ట్ ని ముందుగా శ్రీను వైట్ల మంచు విష్ణు తో చెయ్యాలని అనుకోలేదట.
ఆయన ఇది రవితేజ( Raviteja ) కోసం రాసుకున్న స్క్రిప్ట్ అట.అయితే ఎన్ని సినిమాలు తీసిన అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నాయి, నా కొడుకు తో ఒక సూపర్ హిట్ సినిమాని తీసిపెట్టు అంటూ స్వయంగా మోహన్ బాబు శ్రీను వైట్ల ని ఇంటికి పిలిచి అడిగాడట.కచ్చితంగా భవిష్యత్తులో చేస్తాను సార్, ప్రస్తుతం రవితేజ తో ఒక సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాను అని అన్నాడట.
అవునా ఆ స్టోరీ ఒకసారి వినిపించు అని మోహన్ బాబు అడగగా వెంటనే వినిపించాడట.
ఈ స్క్రిప్ట్ మా అబ్బాయి తో చెయ్యి , రవితేజ తో నేను మాట్లాడుతా అని చెప్పి, రవితేజ కి ఫోన్ చేసి ఈ స్క్రిప్ట్ తనకి ఇవ్వాల్సిందిగా కోరాడట.రవితేజ కూడా ఒప్పుకోవడం తో ఈ సినిమా మంచు విష్ణు హీరో గా ప్రారంభం అయ్యింది.కామెడీ సినిమాని ఇతను ఎలా లాక్కొస్తాడో అని ముందుగా శ్రీను వైట్ల చాలా భయపడ్డాడు అట.కానీ మంచు విష్ణు నటన చూసిన తర్వాత శ్రీను వైట్ల కి షాక్ తగిలింది.రవితేజ ఇలాంటి సినిమాలు చేసి బాగా రొటీన్ అయ్యాడు , మంచు విష్ణు వల్ల కొత్తదనం వచింది అని ఫీల్ అయ్యాడట.
అలా మొదలైన ఈ సినిమా, అప్పట్లో గ్రాండ్ గా విడుదలై సంచలన విజయం సాధించింది.ఆ రోజుల్లోనే ఈ చిత్రం దాదాపుగా 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిందట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy