రాజమౌళి సినిమాపై రవితేజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అంతకుమించిన అవార్డు లేదంటూ?

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఎస్ఎస్ రాజమౌళి( SS Rajamouli ) టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా దర్శకుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు హీరోలు రాజమౌళి దర్శకత్వంలో సినిమాలు చేసే మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా రాజమౌళి డైరెక్షన్లో చేసిన వారిలో మాస్ మహారాజ రవితేజ( Raviteja ) ఒకరు.

Raviteja Interesting Comments On Rajamouli Vikramarkudu Movie Details, Rajamouli

ఈయన రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు( Vikramarkudu ) సినిమాలో నటించారు ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటించారు.ఒక పాత్రలో దొంగగా నటించడం మరొక పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించే సందడి చేశారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమాలో ఒక సన్నివేశం గురించి రవితేజ మాట్లాడుతూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాలో వీధిలో ఆడోళ్ళందరూ కూడా రవితేజ పై పోట్లాటకు వచ్చే సన్నివేశం అందరిని కడుపుబ్బా నవ్విస్తుంది.

Raviteja Interesting Comments On Rajamouli Vikramarkudu Movie Details, Rajamouli
Advertisement
Raviteja Interesting Comments On Rajamouli Vikramarkudu Movie Details, Rajamouli

అయితే ఈ సన్నివేశం షూటింగ్ చేసే సమయంలో షాట్ కంప్లీట్ అయినప్పటికీ రాజమౌళి మాత్రం కట్ చెప్పలేదట దీంతో రవితేజ ఏమైందని చూడటంతో ఆయన మానిటర్ ముందు కూర్చొని పగలబడి నవ్వుతున్నారని రవితేజ తెలిపారు.ఆయన మాత్రమే కాదు ఈ షూటింగ్ జరిగేటప్పుడు చుట్టూ 200 మంది ఉన్నారు వారందరూ కూడా అలాగే నవ్వుతూ ఉన్నారు ఎవ్వరిని ఆపడానికి వీలు కాలేదు.అలా ఆరోజు అందరి నుంచి వచ్చిన ఆ రెస్పాన్స్ చూసి నేను షాక్ అయ్యాను.

ఒక నటుడిగా నాకు ఇంతకు మించిన అవార్డులో ఏవీ లేవు అంటూ రవితేజ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు