నటి పూర్ణతో ఎఫైర్.. క్లారిటీ ఇచ్చిన నటుడు రవిబాబు!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రూమర్లకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి.

ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీల గురించి ప్రతిరోజు ఎన్నో రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.

అయితే కొన్నిసార్లు సెలబ్రిటీలు ఆ రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు.ఇలా ఇండస్ట్రీలో సెలబ్రిటీ లాగా కొనసాగుతూ రూమర్లను ఎదుర్కొన్నటువంటి వారిలో నటి పూర్ణ( Poorna ) అలాగే డైరెక్టర్ రవిబాబు( Ravi Babu ) ఒకరని చెప్పాలి.

రవి బాబు నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా పనిచేశారు అయితే ఈయన దర్శకత్వం వహించిన వరుస మూడు సినిమాలలో హీరోయిన్గా పూర్ణ నటించారు.

లడ్డు బాబు,( Laddu Babu ) అవును,( Avunu ) అవును 2( Avunu 2 ) వంటి చిత్రాలలో పూర్ణ నటించగా ఈ సినిమాలకు రవిబాబు దర్శకుడిగా వ్యవహరించారు.ఇలా ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరుణంలో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వీరి గురించి వార్తలు వచ్చాయి.ఇలా వీరిద్దరూ మధ్య ఏదో రిలేషన్ ఉందని వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై వీరు పలు సందర్భాలలో ఖండించిన ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు.

Advertisement

ఇక ఇటీవల పూర్ణ పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలకు కాస్త చెక్ పెట్టినట్టు అయింది.

ఇకపోతే తాజాగా రవిబాబు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా గతంలో పూర్ణతో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి వచ్చినటువంటి వార్తలపై ఈయన స్పందించారు.నాకు పూర్ణకు మధ్య ఎఫైర్( Affair ) ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

మీడియా వారు ఇలాంటి వార్తలను క్రియేట్ చేశారు తప్ప మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని క్లారిటీ ఇచ్చారు.ఇక ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు మేమిద్దరం కలిసి మూడు సినిమాలకు వరుసగా పనిచేయడంతోనే ఇలాంటి వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఆ సినిమాలకు తాను పూర్ణనే తీసుకోవడానికి కారణం ఆ సినిమాలలోని పాత్రలకు పూర్ణ నూటికి నటి శాతం న్యాయం చేయగలదన్న నమ్మకంతోనే తనని ఎంపిక చేసామే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదని ఈయన క్లారిటీ ఇచ్చారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు