రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' వాయిదా.. కారణం ఇదేనట!

మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.

ఎందుకంటే రవితేజ ఏడాదికి నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.

రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఖిలాడీ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది.కానీ ఈయనకు ఆశించిన విజయం అందించలేక పోయింది.

ఇక ప్లాప్ ను వదిలేసి వెంటనే మరో సినిమా స్టార్ట్ చేసేసాడు.ఈ సినిమా తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు.

రవితేజ కెరీర్ లో ఇది 68వ సినిమాగా తెరకెక్కబోతుంది.దీంతో పాటు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

Advertisement

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ సినిమాను జూన్ 17న గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ భావించారు.

కానీ ఈ సినిమా మరోసారి వాయిదా వేసి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు మేకర్స్.ఈ రోజు ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు మేకర్స్.

అందుకు కారణం కూడా తెలిపారు.రామారావు ఆన్ డ్యూటీ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం అవ్వడం వల్లనే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.

త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని నిర్మాతలు ప్రకటించారు.అసలు ఈ సినిమా మార్చి 25న కానీ ఏప్రిల్ 25న కానీ రిలీజ్ అవ్వాల్సి ఉండగా పెద్ద సినిమాల వల్ల ఈ సినిమాను వాయిదా వేసి జూన్ 17న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.ఇక ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ కూడా మార్చేశారు.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

మరి కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి.ఇక ఈ సినిమాలో రవితేజ కు జోడీగా రజిషా విజయన్, దివ్యంసా కౌశిక్ నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు