గుడ్డిలో మెల్ల అన్నట్లు రవితేజ ఫ్యాన్స్‌ హ్యాపీ

మాస్‌ మహారాజా రవితేజ నేడు డిస్కోరాజా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.గత మూడు నాలుగు సంవత్సరాలుగా రవితేజకు మంచి సక్సెస్‌ దక్కలేదు.

మద్యలో రాజా ది గ్రేట్‌ చిత్రం వచ్చింది.అది యావరేజ్‌గా నిలిచింది.

Ravi Teja Fans Happy In Disco Raja Movie-గుడ్డిలో మెల్�

ఆ సినిమాకు ముందు ఆ సినిమా తర్వాత పలు పరాజయాలను మూటకట్టుకున్నాడు.ఒకానొక దశలో రవితేజ కెరీర్‌ ముగిసినట్లే అంటూ చాలా మంది అనుకున్నారు.

ఇలాంటి సమయంలో అనూహ్యంగా రాజా ది గ్రేట్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయనకు యావరేజ్‌ సక్సెస్‌ దక్కింది.ఒడ్డున పడి కొట్టుకుంటున్న చేపకు చిన్న గుంట దొరికి బతికినట్లుగా ఉంది రవితేజ పరిస్థితి.

Advertisement

ప్రస్తుతానికి బతికి బట్ట కట్టినట్లే అంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చాలా కాలంగా అస్సలే సక్సెస్‌ లేని రవితేజకు ఇది చాలా పెద్ద సక్సెస్‌ అంటూ అభిమానులు అంటున్నారు.

యావరేజ్‌ అయినా కూడా గుడ్డిలో మెల్ల అన్నట్లుగా ఇది గొప్ప విజయంగా భావించాల్సిందే అనుకుంటున్నారు.ఈ చిన్న విజయంతో రవితేజ కమ్‌ బ్యాక్‌ అయ్యి మరిన్ని మంచి సినిమాలు చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు