వడా చెన్నై కథ ముందుగా రవితేజ దగ్గరకి వచ్చిందంట

మాస్ మహారాజ్ రవితేజ కమర్షియల్ చిత్రాలతో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

రీసెంట్ గా క్రాక్ సినిమాతో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఇదిలా ఉంటే కమర్షియల్ చిత్రాలు చేసిన అప్పుడప్పుడు రవితేజ ప్రయోగాత్మక కథలు కూడా చేశాడు.

అయితే అవేమీ అతనికి సక్సెస్ అందించలేదు. హైపర్ ఎనర్జీతో పెర్ఫార్మెన్స్ చేసే రవితేజని కూల్ గా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడకపోవడమే ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం అని టాక్ ఉంది.

ఈ నేపధ్యంలో ఎప్పుడో కథ భాగా నచ్చితే కాని అలాంటి ప్రయోగాత్మక కథల జోలికి రవితేజ వెళ్ళడం మానేశాడు.అప్పుడప్పుడు మాత్రం ప్రేక్షకులు ఆదరించరని తెలిసిన నటుడిగా తన సంతృప్తి కోసం కొన్ని చేస్తున్నాడు.

Advertisement

అలాగే తమిళ్ లో విభిన్నకథలతో సినిమాలు చేసే వెట్రిమారన్ రవితేజకి ఒక కథ చెప్పాడు.ఆ కథ అతనికి భాగా నచ్చినా కూడా చేయలేకపోయాడు.

అలాగే రవితేజ కంటే ముందుగా విజయ్ సేతుపతికి కూడా చెప్పాడు.అతనికి కూడా కథ నచ్చిన వరుస కమిట్మెంట్ లు ఉండటం తో సెట్స్ పైకి తీసుకొని వెళ్ళలేకపోయాడు.

తరువాత రవితేజ దగ్గరకి ఆ కథ వచ్చింది.అతను కూడా చేయలేనని చెప్పడంతో ఫైనల్ గా ధనుష్ ఆ ప్రాజెక్ట్ ని టేకప్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్ళాడు.

అదే వడా చెన్నై.ధనుష్, ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, ఆండ్రియా ఈ సినిమాలో నటించారు.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

తమిళ్ లో ఈ సినిమా అద్బుతమైన విజయాన్ని అందుకుంది.ఈ విషయాన్ని దర్శకుడు క్రికెటర్ అశ్విన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు.

Advertisement

అలా వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ మంచి సినిమా చేసే అవకాశం రవితేజ కోల్పోయాడని తెలుస్తుంది.

తాజా వార్తలు