Ratna Pathak Shah : కూతురు వయస్సున్న హీరోయిన్లతో రొమాన్స్.. సిగ్గు లేదా.. నటి సంచలన వ్యాఖ్యలు వైరల్! 

సినిమా ఇండస్ట్రీ( Film Industry )లో ఎంతోమంది హీరోలుగా హీరోయిన్లుగా కొనసాగుతూ ఉంటారు.

అయితే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్టిస్టుకు వయసు పైబడుతున్నప్పటికీ వారి వయసుకు అనుకూలంగా ఉన్నటువంటి పాత్రలలో నటించే అవకాశాలను మాత్రమే కల్పిస్తున్నారు.

కానీ హీరోల విషయంలో మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం.వారితోపాటు ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి హీరోయిన్లకు అమ్మ అమ్మమ్మ పాత్రలు వచ్చినప్పటికీ హీరోలకు మాత్రం ఇంకా హీరోలు గానే ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తున్నారు.

ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా ఇదే కొనసాగుతూ ఉంది.ఇక హీరోలు ఏకంగా తమ కూతురి వయసు ఉన్నటువంటి హీరోయిన్లతో కూడా రొమాన్స్ చేస్తుండడం మనం చూస్తున్నాము.

Ratna Pathak Shah Viral Comments On Internet Details Inside

ఇలా హీరోలు ఏకంగా తమ కూతుర్లు వయసు ఉన్నటువంటి వారితో సినిమాలలో నటించడం పట్ల తాజాగా నటి రత్న పాఠక్ షా ( Ratna Pathak shah )చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఎన్నో సూపర్ హిట్ బాలీవుడ్ సినిమాలలో నటించినటువంటి ఈమె ధక్ ధక్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె హీరోలు తమ కూతుర్ల వయసు ఉన్నటువంటి హీరోయిన్లతో రొమాన్స్ చేయడం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Ratna Pathak Shah Viral Comments On Internet Details Inside-Ratna Pathak Shah

ఈ విషయం గురించి ఏం మాట్లాడాలో నాకు తెలియడం లేదు ఇండస్ట్రీలో హీరోలు కూతురు వయసు ఉన్న వారితో రొమాన్స్ చేస్తున్నారు.

Ratna Pathak Shah Viral Comments On Internet Details Inside

ఇలా కూతురు వయసు ఉన్న వారితో రొమాన్స్ చేయడానికి హీరోలకు సిగ్గుగా అనిపించడం లేదు అలాంటప్పుడు వారి గురించి నేనేం మాట్లాడగలను.దీని గురించి మాట్లాడటానికి నాకే సిగ్గుగా ఉంది అంటూ నటి రత్న పాఠక్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.విషయంలో కచ్చితంగా ఏదో ఒక రోజు మార్పు వస్తుంది ప్రస్తుతం మహిళలందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.

చిత్ర పరిశ్రమలో మహిళలు( Women ) కూడా అద్భుతాలు సృష్టించగలరు కానీ ఇందుకు కాస్త సమయం పడుతుందని, తప్పకుండా ఇది జరిగి తీరుతుంది అంటూ రత్న పాఠక్ ఇండస్ట్రీలో మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను చెబుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు